Telangana Politics: టార్గెట్ మునుగోడు..! యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ..

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఫోకస్ పెట్టారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం కావడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఉప ఎన్నికలో విజయం సాధించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు బాటలు వేసుకోవాలని రెండు పార్టీలు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి.

Telangana Politics: టార్గెట్ మునుగోడు..! యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ..

Telangana Politics: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయనుండటంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తాను బీజేపీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు బాటలు వేసుకోవాలని బీజేపీ దృష్టి కేంద్రీకరించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం మునుగోడుపై గట్టి ఫోకస్ పెట్టింది. ఉప ఎన్నిక వస్తే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకొని తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Rajagopal Reddy Resignation : మేడం సోనియా.. అవమానాలు భరిస్తూ ఉండలేను

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మునుగోడులో వచ్చే ఉప ఎన్నికల్లో బీజేపీ తరుపున ఆయన బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రస్తుతం మూడవ విడత పాదయాత్రలో ఉన్న బండి సంజయ్.. శనివారం పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇవ్వనున్నారు. రేపు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ సంజయ్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీలో రాజగోపాల్ రెడ్డి చేరిక, మునుగోడు ఉప ఎన్నికపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం కావడంతో.. ఢిల్లీలో చేర్చుకోవాలా? లేక పాదయాత్ర సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో కాషాయ కండువా కప్పాలా అనే దానిపై జాతీయ స్థాయి అగ్రనేతలతో సంజయ్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Komatireddy Rajagopal Reddy: డబ్బులు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ఓ దొంగ..బ్లాక్ మెయిలర్

పాదయాత్ర జరుగుతున్న తీరు, తెలంగాణలో రాజకీయ పరిస్థితులను జాతీయ నేతలకు సంజయ్ వివరించే అవకాశం ఉంది. మరోవైపు త్వరలో రాబోయే మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మునుగోడులో వాస్తవ పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్న అగ్రనేత అమిత్ షా.. ఇప్పటికే ఉప ఎన్నిక కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికకు ఇప్పటి నుంచే పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది. నేడోరేపో మునుగోడు ఉప ఎన్నిక కోసం కమిటీనిసైతం నియమించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది. ఇప్పటి నుంచే మునుగోడుపై గురి పెట్టడం ద్వారా నాలుగో ఆర్ ను అసెంబ్లీకి పంటమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.

Revanth Reddy : తెలంగాణపై కేసీఆర్,కేటీఆర్ కుట్రలు చేస్తున్నారు-రేవంత్ రెడ్డి

మరోవైపు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడకుండా ఉండేందుకు ఆ పార్టీ సీనియర్ నేతలు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లభించలేదు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించడంతో పాటు బీజేపీలో చేరేందుకు సిద్ధమైయ్యాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీమానా చేయనున్నారు. మునుగోడులో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తుండటంతో ఆ నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలు పెట్టింది. ఓ పక్క రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు దాడి కొనసాగిస్తూనే.. మరోపక్క నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ చెక్కు చెదరకుండా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో నేడు చండూరులో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సైతం హాజరు కానున్నారు.

Komatireddy Rajagopal Reddy : ‘ఇది కేసీఆర్ పై నా యుద్ధం..ఎవ్వరి మాటా వినేదేలే..రాజీనామా విషయంలో తగ్గేదేలే’..

ఇప్పటికే మునుగోడుపై మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో స్ట్రేటెజీ కమిటీని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. రాజగోపాల్ రెడ్డి సమావేశాలకు హాజరవుతున్న మండల పార్టీ అధ్యక్షులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. పార్టీ సంస్థాగత ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. అయితే నేడు చండూరులో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంకు టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యే అంశంపై క్యాడర్ లో ఉత్కంఠ నెలకొంది.