Spa Centres : స్పా మాటున క్రాస్ మసాజ్.. బంజారాహిల్స్‌లోని స్పా సెంటర్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు

హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. స్పా సెంటర్ల పేరుతో క్రాస్ మసాజ్, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేశారు.

Spa Centres : స్పా మాటున క్రాస్ మసాజ్.. బంజారాహిల్స్‌లోని స్పా సెంటర్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు

Spa Centres : హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఫిలింనగర్ లోని స్పా సెంటర్లలో తనిఖీలు చేశారు. 18మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ల పేరుతో క్రాస్ మసాజ్, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేశారు.

 

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

బంజారాహిల్స్ లో దాదాపు 35కు పైగా స్పా సెంటర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే.. స్పా సెంటర్ల ముసుగులో క్రాస్ మసాజ్, ఇల్లీగల్ కార్యక్రమాలు కొంతకాలంగా కొనసాగిస్తున్నారనే సమాచారంతో బంజారాహిల్స్ పోలీసులు నిఘా పెట్టారు. బంజారాహిల్స్ పోలీసులు, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జాయింట్ గా దాడులు చేయడం జరిగింది.