Ganta meet KTR : కేటీఆర్ ను కలిసిన గంటా : ఉక్కు ఉద్యమానికి మద్దతుగా విశాఖ రావాలని ఆహ్వానం

తెలంగాణ మంత్రి కేటీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా విశాఖపట్నం రావాలని ఆహ్వానించారు.

Ganta meet KTR : కేటీఆర్ ను కలిసిన గంటా : ఉక్కు ఉద్యమానికి మద్దతుగా విశాఖ రావాలని ఆహ్వానం

Ganta Srinivasa Rao meet Minister KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం (మార్చి 20, 2021) కేటీఆర్ ను కలిసి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా విశాఖపట్నం రావాలని ఆహ్వానించారు. విశాఖ పర్యటనపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని గంటాకు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఉద్యమానికి ఇది వరకే కేటీఆర్ మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై (మార్చి 11, 2021)న తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. కేసీఆర్ ఆదేశిస్తే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొంటామని పేర్కొన్నారు. ఈరోజు ఏపీలో అమ్ముతున్నారు..రేపు తెలంగాణలో అమ్మడం మొదలుపెడతారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కానివ్వబోమని చెప్పారు.

కేంద్రం వైఖరికి నిరసనగా అవసరమైతే విశాఖలో పోరాటం చేస్తామని చెప్పారు. కేంద్రం వైఖరికి నిరసనగా అందరూ పోరాడాలని పిలుపిచ్చారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుని ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతు తెలుపుతామని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరిస్తే తమకు సంబంధం ఏంటి అనుకోమని తెలిపారు. ఇప్పుడు తాము పట్టించుకోకపోతే తెల్లారి మన దగ్గరకు వస్తారని చెప్పారు.