TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్

జూన్ 12న టెట్‌ పరీక్ష నిర్వహించారు. పేపర్-1కు 3,18,506 మంది అభ్యర్థులు, పేపర్‌-2కు 2,51,070 మంది హాజరు అయ్యారు.

TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్

TET Final Key : టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(TET) ఫైనల్ కీ విడుదల అయింది. టెట్ కన్వీనర్ రాధారెడ్డి బుధవారం (జూన్ 29,2022) ‘కీ’ని విడుదల చేశారు. జూలై1న టెట్‌ ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ నెల 27న టెట్‌ ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో ఫలితాల విడుదల ఆలస్యం కానున్నట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత మరింత సమయం పడుతుందని తెలిపారు. అయితే టెట్‌ ఫలితాలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టత ఇచ్చారు. జూలై 1న ఫలితాలు ప్రకటించారు.

AP TET: ఏపీ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల

జూన్ 12న టెట్‌ పరీక్ష నిర్వహించారు. పేపర్-1కు 3,18,506 మంది అభ్యర్థులు, పేపర్‌-2కు 2,51,070 మంది హాజరు అయ్యారు. ఈ నెల 15న ప్రైమరీ కీ విడుదల చేశారు. ప్రస్తుతం ఫైనల్‌ ‘కీ’ని విడుదల చేశారు.