Publish Date - 2:21 pm, Mon, 1 March 21
teacher show blu films in phone to girl students: విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా, ప్రయోజకులు అయ్యేలా తీర్చిదిద్దేది గురువే. అందుకే గురువంటే దైవంతో సమానం అంటారు. టీచర్ అన్నా, ఉపాధ్యాయ వృత్తి అన్నా ఎంతో గౌరవం ఇస్తారు. కానీ కొందరు గురువులు దారి తప్పుతున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి క్లాస్ రూమ్ లోనే గలీజు పనులు చేస్తున్నారు.
క్లాస్ రూమ్ లో పిల్లలకు పాఠాలు నేర్పాల్సిన ఓ టీచర్, తన సెల్ ఫోన్ లో వారికి నీలిచిత్రాలు చూపించాడు. వారికి అవి చూపించి పైశాచిక ఆనందం పొందాడు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం ఘెట్ కురిలో ఈ ఘటన జరిగింది. ఈ విషయం డీఈవో రవీందర్ రెడ్డికి చేరింది. ఆయన వెంటనే చర్యలు తీసుకున్నారు. సదురు టీచర్ ఖదీర్ ను సస్పెండ్ చేశారు. దీనిపై విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ కీచక టీచర్ ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వైఎస్ షర్మిల అరెస్ట్
వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు
Mayur Vihar phase : ఫ్లై ఓవర్ కింద పాఠాలు, యువకుల వినూత్న ప్రయోగం
Selfie: సెల్ఫీ మోజులో.. ప్రేమజంట మృతి
Government Teacher : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలను బడికి రప్పించేందుకు ప్రభుత్వ స్కూల్ టీచర్ సూపర్ ఐడియా
One tree two colors :ఒక చెట్టుకు రెండు రంగులు..ఏప్రిల్ లో మాత్రమే కనిపించే వింత