Teachers Dharna : బదిలీల విషయంలో టీచర్ల ఆందోళన

బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు. జీవో నెంబర్ 317 వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతోందని వారు ఆందోళన చేస్తున్నారు.

Teachers Dharna : బదిలీల విషయంలో టీచర్ల ఆందోళన

Teachers Dharna

Teachers Dharna : బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు. జీవో నెంబర్ 317 వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతోందని వారు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో జీవో.. 317 కొత్త రగడకు కారణమైన ఆర్డర్ ఇది. కొత్త జోనల్ విధానం ప్రకారం.. ప్రభుత్వ టీచర్లను సర్దుబాటు చేసే విషయంలో.. ఇప్పుడు రచ్చ నడుస్తోంది. ఈ జీవోను.. వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు ఆందోళనలు ఉద్ధృతం చేశాయి. అసలేంటి వాళ్ల డిమాండ్స్? జీవో 317తో ఉన్న ఇబ్బందులేంటో ఒకసారి చూద్దాం…

తెలంగాణలో కొత్త జోన్ల ప్రకారం ప్రభుత్వం ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ మొదలుపెట్టింది. సీనియారిటీ ప్రాతిపదికన.. బదిలీలతో ఉద్యోగులను శాశ్వత సర్దుబాటు చేస్తున్నారు. కానీ.. ఈ కేటాయింపులు జోనల్ వ్యవస్థకు విరుద్ధంగా జరుగుతున్నాయని వాదిస్తున్నారు ఉద్యోగులు. సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని.. శాశ్వత బదిలీలు చేయడం తగదని.. ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు ఆందోళనలు ఉద్ధృతం చేశాయి.

జీవో 317ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. టీచర్లు, లెక్చర్లరంతా పోరుబాట పట్టారు. స్థానికతను పట్టించుకోకుండా చేసిన ట్రాన్స్‌ఫర్లతో.. భవిష్యత్తులో లోకల్, నాన్ లోకల్ గొడవలు జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాలకు ఇష్టమొచ్చినట్లు కేటాయిస్తున్నారని.. ఇంటర్‌ బోర్డు ఆఫీస్ ఎదుట  వారు నిన్న ఆందోళన చేశారు. తర్వాత.. బీఆర్కే భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీనియారిటీ లిస్టుల్లో.. పొరపాట్లున్నాయని, ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందని.. కౌన్సిలింగ్ సరిగా లేదని.. అభ్యంతరాలను పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ.. ఉపాధ్యాయులు నిరసనలను ఉధృతం చేశారు. ఉద్యోగుల సర్దుబాటులో.. స్థానికత అంశం లేకుండా చేశారని.. కొత్త జిల్లాలకు తమను బలవంతంగా బదిలీ చేస్తున్నారని వాపోతున్నారు.
Also Read : Black Magic : డోన్‌లో క్షుద్రపూజల కలకలం
సీనియారిటీ ప్రకారం కాకుండా.. స్థానికతను ప్రామాణికంగా తీసుకొని.. భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి టీచర్ల సంఘాలు. జీవో 317ను రద్దు చేసి.. ఖాళీగా ఉన్న 75 శాతం పోస్టులను నిరుద్యోగ యువతతో భర్తీచేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు పాఠశాలలను ఎంపిక చేసుకునే విషయంలో ప్రభుత్వం ప్రత్యక్ష కౌన్సిలింగ్‌ను రద్దు చేసి వెబ్ కౌన్సిలింగ్ చేపట్టడం పట్ల..ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.