Telangana : 317 జీవో వివాదం, ఉపాధ్యాయసంఘాల నేతల ముందస్తు అరెస్టు

తీవ్ర అనారోగ్య సమస్యలున్న వాళ్లను దూర ప్రాంతాలకు బదిలీ చేయడం దుర్మార్గమన్నారు. 2012 నుంచి అంతర్‌ జిల్లా బదిలీలు చేపట్టలేదని గుర్తుచేశారు. బాధిత ఉపాధ్యాయులంతా మహాధర్నాకు

Telangana : 317 జీవో వివాదం, ఉపాధ్యాయసంఘాల నేతల ముందస్తు అరెస్టు

Teachers Dharna

GO 317 : తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళన ఉధృతం చేశారు. 2022, ఫిబ్రవరి 09వ తేదీ బుధవారం హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ వద్ద మహాధర్నాకు దిగనున్నాయి. జీవోకు సవరణలు చేసే వరకు వెనక్కు తగ్గేదిలేదని, ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వెల్లడించారు. తమ పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఇవేవీ తమ ఆందోళనను అడ్డుకోలేవన్నారు.

Read More : Meenakshi Chaudhary : ముద్దు సీన్స్‌లో నటించడానికి ఇబ్బంది లేదు.. రవితేజతో లిప్‌లాక్‌ పై హీరోయిన్ వ్యాఖ్యలు

ఇది ఆరంభం మాత్రమేనని, సర్కార్‌ దిగిరాకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. టీచర్ల మనోగతానికి విరుద్ధంగా ప్రభుత్వం బలవంతపు బదిలీలు చేసిందని ఆరోపించారు. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్‌లో నాన్‌ లోకల్స్‌ గో బ్యాక్‌ అనే నినాదం బలపడే వీలుందన్నారు.టీచర్లు పెట్టుకున్న అప్పీళ్లను బుట్టదాఖలు చేయడం దుర్మార్గమన్నారు. 317 జీవో వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారని యూటీఎఫ్‌ నేత జంగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలున్న వాళ్లను దూర ప్రాంతాలకు బదిలీ చేయడం దుర్మార్గమన్నారు. 2012 నుంచి అంతర్‌ జిల్లా బదిలీలు చేపట్టలేదని గుర్తుచేశారు. బాధిత ఉపాధ్యాయులంతా మహాధర్నాకు స్వచ్ఛందంగా హాజరవాలని పిలుపునిచ్చింది ఉపాధ్యాయ సంఘం.