Microsoft: హైదరాబాద్ లో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్

అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ సంస్థకు చెందిన అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తుంది

Microsoft: హైదరాబాద్ లో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్

Microsoft

Microsoft: అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన భారత కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా తమ సంస్థకు చెందిన అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తుంది మైక్రోసాఫ్ట్. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా రానున్న 15 ఏళ్ల కాలంలో ఈ డేటా సెంటర్ అభివృద్ధికి గానూ..రూ.15,000 కోట్ల రూపాయలు సంస్థ పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న డేటా సెంటర్ ను మరింత విస్తరించనుంది. ఇప్పటికే అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించి కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ లో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుతో అమెజాన్ వంటి సంస్థల సరసన మైక్రోసాఫ్ట్ కూడా చేరింది.

Also read: H.M Amit Shah: సీబీఐ, ఎన్ఐఏ, ఎన్సీబీలు కూడా నేరాల డేటాబేస్‌లో చేరాలి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ పరివర్తనకు వేదికగా క్లౌడ్‌ ప్లాట్ఫారమ్ కు డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్‌లోని డేటా సెంటర్‌ను 2025 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. మైక్రోసాఫ్ట్ కు చెందిన మొత్తం క్లౌడ్ పోర్ట్‌ఫోలియో, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రొడక్టివిటీ టూల్స్ మరియు ఎంటర్‌ప్రైజెస్, స్టార్టప్‌లు, డెవలపర్‌ల కోసం అధునాతన సెక్యూరిటీ వ్యవస్థతో ఈ డేటా సెంటర్ ను అభివృద్ధి చేయనున్నారు.

Also read: Car Manufacturing: కొనసాగుతున్న చిప్ ల కొరత: కార్ల సంస్థలపై తీవ్ర ప్రభావం

ఇప్పటివరకు ఐటీ సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ ప్రస్తుతం డేటా సెంటర్ లకు, క్లౌడ్ సేవల సంస్థలకు నిలయంగా మారుతుంది. భౌగోళికంగా హైదరాబాద్ స్థిరంగా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. 2-3 సీస్మిక్ జోన్‌లో ఉన్న హైదరాబాద్‌లో భూకంపాలు, వరదలు నమోదయ్యే అవకాశమే లేదు. అదే సమయంలో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా బేస్ డొమైన్‌లలో అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నారు. వీటితో పాటుగా ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాలతో పోల్చుకుంటే ఇక్కడ కార్యాలయాల అద్దెలు తక్కువగా ఉండడంతో పాటు ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లబిస్తుంది. దీంతో ప్రపంచ స్థాయి సంస్థలు తమ కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా సాగించేందుకు శ్రద్ధ చూపిస్తున్నాయి.

Also read: AP Cancer Hospitals : ఏపీలో మూడు క్యాన్సర్ ఆసుపత్రులు.. అతి తక్కువ ధరకే చికిత్స