TSRTC: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ప్రతీఏటా సంక్రాంతి పండుగకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సంస్థలు అదనపు బస్సులను నడపుతుంటాయి.

TSRTC: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Tsrtc (2)

TSRTC: ప్రతీఏటా సంక్రాంతి పండుగకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సంస్థలు అదనపు బస్సులను నడపుతుంటాయి. ఈ ఏడాది కూడా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రకి 984ప్రత్యేక బస్సులు నడుపుతోంది TSRTC. ఈ నెల 7వ తేదీ అంటే రేపటి నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి ఏపీలోని 13 జిల్లాల్లోని వివిధ పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది టీఎస్ఆర్‌టీసీ.

గతేడాతి ఇదే సమయంలో టీఎస్ఆర్‌టీసీ 4వేల 980 బస్సులు నడపగా.. ఈ ఏడాది 4వేల 318బస్సులను నడిపుతున్నట్లు ప్రకటించింది సంస్థ. బస్సులను హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట్, ఎంజీబీఎస్, ఎల్‌బీనగర్, జీడిమెట్ల, జేబీఎస్, ఈసీఐఎల్‌ నుంచి నడుపున్నట్లు వెల్లడించింది.

Fishermen Released : శ్రీలంక జైలు నుంచి 12 మంది జాలర్లు విడుదల

అయితే, గతంలో సంక్రాంతికి బస్సులు ఎక్కువ రేటుతో నడిచేవి. కానీ, ఇప్పుడు మాత్రం ఎటువంటి అదనపు వసూళ్లు లేకుండా బస్సులను నడపనున్నట్లు ఆర్‌టీసీ ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా స్పెషల్ బస్సులను అదనంగా ఏర్పాటు చేయగా.. వాటికి రిజర్వేషన్‌ ఉంటుందని చెప్పారు అధికారులు.

రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు వైపు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్ బయట ఉన్న ఓల్డ్‌ సీబీఎస్‌ హాంగర్‌ నుంచి బయలుదేరతాయి. సంక్రాంతికి నడిచే APSRTC బస్సులపై అదనపు చార్జీలు వసూలు చెయ్యనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఏపీకి వెళ్లేవారు తెలంగాణ బస్సులు ఎక్కించేలా ప్లాన్ చేస్తుంది టీఎస్ఆర్‌టీసీ.