ఫేస్ మాస్క్ ధరించిన కేసీఆర్

  • Published By: venkaiahnaidu ,Published On : April 13, 2020 / 01:16 PM IST
ఫేస్ మాస్క్ ధరించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫేస్‌ మాస్క్‌ ధరించారు. సోమవారం(ఏప్రిల్-13,2020)కరోనాపై అధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్ష సందర్భంగా సర్జికల్ మాస్క్‌ ధరించి సమావేశంలో పాల్గొన్నారు కేసీఆర్‌. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీకి ముందు చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్నారు.

తెలంగాణలో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సీఎం సహాయ నిధికి విరాళం అందజేయడానికి పలువురు ప్రముఖులు ప్రగతిభవన్‌కు వస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సీఎం కేసీఆర్‌ మాస్క్‌ ధరించి సమావేశాల్లో పాల్గొంటున్నారు. 

తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదై దాదాపు నెలన్నర రోజులవుతోంది. మార్చి 1న హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి కరోనాపై అసెంబ్లీతో పాటు కేబినెట్ సమావేశాల్లోనూ పలుమార్లు చర్చ జరిగింది. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఎప్పుడూ మాస్క్ ధరించలేదు. ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించినా.. ప్రెస్ మీట్ పెట్టినా.. సామాజిక దూరం పాటిస్తూ వచ్చారే తప్ప మాస్క్ పెట్టుకోలేదు.

ఇటీవల ప్రధాని సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో దాదాపు అందరు ముఖ్యమంత్రులు మాస్క్‌లతో కనిపించారు. అప్పుడు కూడా సీఎం కేసీఆర్ మాస్క్ ధరించలేదు. కానీ మంగళవారం ఆయన తొలిసారిగా ఆయన మాస్క్ ధరించి కనిపించారు. ఇన్ని రోజులకు సీఎం కేసీఆర్ సర్జికల్ మాస్క్‌ ధరించారు. కాగా,తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 500దాటిన విషయం తెలిసిందే.