Telangana : ఆదిలాబాద్ జిల్లాలో కంటైనర్ ని ఢీకొన్న కారు.. నలుగురు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో ఓ కారు కంటైనర్ ని ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు.

Telangana : ఆదిలాబాద్ జిల్లాలో కంటైనర్ ని ఢీకొన్న కారు.. నలుగురు మృతి

రోడ్డు ప్రమాదాలు..ఎంతోమంది కుటుంబాల్లో విషాదాన్ని మిగులుస్తున్నాయి. అతివేగం..డ్రంక్ అండ్ డ్రైవ్..నిర్లక్ష్యం వెరసి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈక్రమంలో అటువంటి మరో ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో ఆదివారం (అక్టోబర్30,2022) రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఓ కారు కంటైనర్ ను ఢీకొనటంతో నలుగురు మృతి చెందారు.

హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కారు సీతాగొంది వద్ద కంటెయినర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పురుషులుకాగా.. ఓ మహిళ ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన మరో మహిళను హాస్పిటల్ కు తరలించారు. మృతులను ఆదిలాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా తెలంగాణలోని మరో జిల్లా కొత్తగూడెంలోని బూర్గంపాడు మండలంలో కూడా మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. బూర్గంపాడు మండటం పోలవరం వద్ద బొలెరో వాహనం అదుపు తప్పి నేషనల్ హైవే పక్కనున్న ఓ గోతిలో పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.