Telangana : టీఆర్ఎస్‌లో చేరనున్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్

బీజేపీకి బిగ్‌ షాక్‌ ఇచ్చారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద్‌ భాస్కర్‌. బీజేపీ వదిలి టీఆర్ఎస్ లోకి చేరనున్నారు. రాపోలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజీనామా లేఖ పంపారు.

Telangana : టీఆర్ఎస్‌లో చేరనున్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్

Telangana : బీజేపీకి బిగ్‌ షాక్‌ ఇచ్చారు రాపోలు ఆనంద్‌ భాస్కర్‌. బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరనున్నారు. దీనికి సంబంధించి రంగం సిద్ధం చేసుకుని బీజేపీకి రాజీనామా చేశారు రాపోలు. పార్టీకి కాసేపటి క్రితమే… రాపోలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజీనామా లేఖ పంపారు. ఇక ఇవాళ లేక రేపు టీఆర్ఎస్‌లో చేరనున్నారు ఆనంద్‌ భాస్కర్‌. రాజీనామా సందర్భంగా రాపోలు నడ్డాకు బహిరంగ లేఖ రాశారు. చేనేత కార్మికుల సమస్యలు బీజేపీ పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు.

టీఆర్ఎస్ లో రాపోలు చేరటానికి ఇప్పటికే సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో కేసీఆర్ తో భేటీ అయి అన్నివిషయాలు చర్చించారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను అభినందించారు. తాను బీజేపీకి రాజీనామా చేసి టీ(బీ).ఆర్‌.ఎస్ లో చేరుతాన‌ని సీఎం కేసీఆర్ కు స్పష్టంచేశారు. తెలంగాణలో అమ‌ల‌వుతున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు అద్భుతంగా ఉన్నాయ‌ని ఆనంద భాస్క‌ర్ ఈ సందర్భంగా ప్రశంసించారు.

Munugode By Poll : ఆపరేషన్ మునుగోడు : కమలానికి షాకులు మీద షాకులు.. టీఆర్ఎస్ లోకి క్యూ కడుతున్న బీజేపీ నేతలు

కాగా మునుగోడు ఉప ఎన్నికల తెలంగాణలో హీట్ పుట్టిస్తున్న క్రమంలో ఇప్పటికే పలువురు నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు.  ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య టీఆర్ఎస్ లో చేరారు. బీజేపీకి గుడ్ బై చెప్పి దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ టీఆర్ఎస్ లోకి వచ్చి చేరారు.ఇంకా పలువురు బీజేపీ నేతలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటోంది గులాబీ దళం. ఈక్రమంలో రాపోలు ఆనంద్ భాస్కర్ కూడా గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.