TS floods : అడవిలో మేతకు వెళ్లి..140 ఆవులు మృతి.. మరో 89 గల్లంతు

వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అడవిలో మేతకు వెళ్లిన 140 ఆవులు చనిపోయాయి. మరో 89 ఆవులు గల్లంతు అయ్యాయి.

TS floods : అడవిలో మేతకు వెళ్లి..140 ఆవులు మృతి.. మరో 89 గల్లంతు

140 Cows Died Due To Flood..

140 cows died due to flood : కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. వర్షాలు తగ్గుముఖం పట్టటంతో వరద ఉదృతి కూడా తగ్గుతోంది. ఇదిలా ఉండగా ఈ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వీర్నపల్లి మండలం మద్దిమల్ల, రుద్రంగి మండలం దేగావత్ తండాలో అడవిలో మేతకు వెళ్లిన 140 ఆవులు చనిపోయాయి. మరో 89 ఆవులు గల్లంతు అయ్యాయి. హుషారుగా మేతకు వెళ్లిన గోమాతలు కళేబరాలుగా కనిపించటంతో గ్రామం అంతా విషాదం అలుముకుంది.

మద్దిమల్ల తండాకు చెందిన 23మంది రైతులకు సంబంధించిన ఆవులు మూడు రోజుల క్రితం సమీపంలో ఉన్న అడవిలోకి మేతకు వెళ్లాయి. రోజు మేతకు వెళ్లి సాయంత్రానికల్లా ఇళ్లకు తిరిగి వచ్చే ఆవుతు సాయంత్రం అయినా..రాత్రి అయినా ఇంటికి రాకపోవటంతో సదరు రైతులు ఆందోళన చెందారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఆవులు ఏమయ్యాయోనని ఆందోళన చెందారు.

అలా ఆవులను వెతుక్కుంటూ గురువారం (జులై 14,2022) రాత్రి అడవికి వెళ్లి చూడగా 80 ఆవులు మరణించి కనిపించాయి. దీంతో ఆ రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మరో 49 ఆవులు కనిపించకుండా పోయాయి. వాటికోసం గాలిస్తున్నారు. అలాగే రుద్రంగి మండలం దేగావత్ తండా. కున్న సోత్ తండా, జోత్యతండాకు చెందిన 100 ఆవుల్లో 60 ఆవులు చనిపోయాయి. మరో 40 ఆవులు ఆచూకీ తెలియటంలేదు. ఆవులన్నీ శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోయి మరణించాయని పశువైద్యులు తెలిపారు.