36 మంది sarpanch లపై వేటు, రెవెన్యూ చట్టం ఏం చెబుతోంది ?

  • Published By: madhu ,Published On : September 28, 2020 / 02:36 PM IST
36 మంది sarpanch లపై వేటు, రెవెన్యూ చట్టం ఏం చెబుతోంది ?

telangana sarpanch New Revenue Act : కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నాం..జాగ్రత్తగా మెలగాలని, లేకపోతే..కఠిన చర్యలు తీసుకుంటామని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ కొంతమంది సర్పంచ్ లు లైట్ తీసుకున్నారు. అనుకున్నట్లుగానే..ప్రభుత్వం కొరఢా ఝులిపించింది. 36 మంది సర్పంచ్ లపై వేటు వేసింది.



కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన పంచాయతీరాజ్‌ చట్టం–2018 ప్రకారం విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం వహించిన వారిపై వేటు పడింది. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన 36 మంది సర్పంచ్‌లను ఆయా జిల్లాల కలెక్టర్లు సస్పెండ్‌ చేయడం సంచలనం సృష్టిస్తోంది.



గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ. 339 కోట్లు విడుదల చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. కానీ..కొంతమంది సర్పంచ్ లు పని చేయకుండా..లైట్ తీసుకుంటున్నారు. వీరిపై కొరఢా ఝులిపిస్తోంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన మండల పంచాయతీ అధికారులు(ఎంపీవో), పంచాయతీ కార్యదర్శులపైనా కన్నెర్ర జేసింది. దీంతో పంచాయతీ పాలకవర్గాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.



పల్లె ప్రగతి నిర్వహణ, హరితహారం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలకు స్థలాల ఎంపికల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇందులో జాప్యాన్ని ప్రదర్శించిన పలువురు సర్పంచ్‌లపై వేటు వేసింది ప్రభుత్వం. ఇటీవలి కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతృప్తి చెందలేదు.



వెంటనే కలెక్టర్లు..సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల వ్యవధిలో 36 మంది గ్రామ సర్పంచ్‌లపై వేటు పడింది. అలాగే 92 మంది పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు ఎంపీవోలపైనా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు.



చట్టం ఏం చెబుతోంది ? 
పంచాయతీరాజ్‌ చట్టం–2018 సెక్షన్‌ –37(5) విధుల పట్ల నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం, అలసత్వం, అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిని తొలగించే అధికారం కలెక్టర్లకు ఉంది.
సెక్షన్‌ 284 ప్రకారం.. డిసెంబర్‌ 31లోపు నిధుల వినియోగానికి సంబంధించి ఆడిట్‌ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది.
నోటీసులు ఇవ్వకుండా సర్పంచ్, కార్యదర్శులను తొలగించవచ్చు.



సెక్షన్‌ 43 ప్రకారం.. రికార్డుల నిర్వహణ, వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ, 100% ఇంటి పన్నుల వసూళ్లలో ఆశించిన స్థాయిలో పనిచే యని కార్యదర్శులపైనా చర్యలు తీసుకోవచ్చు.
సెక్షన్‌ 37(5) ప్రకారం.. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన ఉపసర్పంచ్‌లపైనా కూడా చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లు ఉంది.