విద్యా సంవత్సర ప్రారంభమయ్యేది సెప్టెంబర్ 1నుంచే..

విద్యా సంవత్సర ప్రారంభమయ్యేది సెప్టెంబర్ 1నుంచే..

క‌రోనా భయంతో స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేయడానికి ఇటు మేనేజ్‌మెంట్ నుంచి గానీ, అటు తల్లిదండ్రుల నుంచి గానీ ఎటువంటి ఆసక్తి కనిపించడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ టీచింగ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అయింది. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ఉండాలని ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబరు 1నుంచే వీటిని ప్రారంభించాలని అనుకుంటున్నారు.

అంటే అధికారికంగా 2020-2021 విద్యా సంవ‌త్స‌రం సెప్టెంబర్ 1నుంచి ప్రారంభం అవుతుందన్నట్లేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేర‌కు సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసి విషయాన్ని వెల్లడించింది. మూడో త‌ర‌గ‌తి, ఆపై స్థాయి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ లోనే క్లాసులు బోధించనున్నట్లు తెలిపింది. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్ర‌కారమే త‌ర‌గ‌తుల నిర్వహణ జరుగుతుందని పేర్కొంది. ఈ త‌ర‌గ‌తుల ప్రారంభానికి ముందే ఆగష్టు 27 నుంచే ఉపాధ్యాయులు స్కూళ్ల‌కు రావాల్సి ఉంటుంద‌ని ఆర్డర్స్ ఇష్యూ చేసింది.

విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం గురించి మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం ఆగష్టు 5న భేటీ అయింది. ఈ స‌మావేశంలో విద్యా సంవ‌త్స‌ర ప్రారంభం స‌హా అడ్మిషన్ల ప్రక్రియ, విద్యా బోధన ఎలా జ‌ర‌పాలనే అంశాలపై చ‌ర్చలు జరిపింది ప్రభుత్వం.

అటు ఆంధ్రప్రదేశ్ లోనూ విద్యా సంవత్సరాన్ని సెప్టెంబరు నుంచే ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. కాలేజీలు సెప్టెంబర్ నుంచే మొదలుపెట్టాలని కొద్ది రోజుల ముందుగానే