తెలంగాణలో ఒక్కోక్కటిగా బయటపడుతున్న అవినీతి అధికారుల లీలలు

  • Published By: dharani ,Published On : June 10, 2020 / 02:27 AM IST
తెలంగాణలో ఒక్కోక్కటిగా బయటపడుతున్న అవినీతి అధికారుల లీలలు

రాష్ట్రంలో అవినీతి అధికారులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. లంచం కోసం ప్రజలను పీక్కుతింటున్నారు. ప్రజలకు సేవ చేయడం మర్చిపోయి… వారి నుంచి లంచాలు నొక్కుతున్నారు. సామాన్యుడు ఏసీబీని ఆశ్రయిస్తుండడంతో… ఒక్కొక్క అవినీతి చేప బయటపడుతోంది. ఏసీబీ వరుస దాడులతో లంచావతారులు పట్టుబడుతున్నారు. 

హైదరాబాద్‌ లోని పెద్ద అంబర్‌పేట మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.వీ రవీందర్‌ ఏసీబీకి చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి లక్షా 50వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొత్త భవనాన్ని నిర్మిస్తోన్న ఓ వ్యక్తి
 భవన నిర్మాణ అనుమతికి కోసం కమిషనర్‌ ఎల్‌వీ రవీందర్‌ దగ్గరకు వెళ్తే.. పని ఊరికే జరగదని.. లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. 

దీంతో ఆ వ్యక్తి లక్షన్నర లంచం ఇస్తుండగా.. ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే ఏసీబీ అధికారులు రవీందర్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు.  అతని నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌ షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత అవినీతి వ్యవహారం తెలంగానలో సంచలనం రేపింది. 40 కోట్ల విలువైన భూ వ్యవహారంలో అవినీతి జలగలు బయటపడ్డాయి. ఈ కేసు విచారణలో ఉండగానే మరో అవినీతి అధికారి ఏసీబీకి అడ్డంగా దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది.
 

ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోరింది. ఈ మేరకు కస్టడి పిటిషన్‌ను కోర్టులో వేసింది. న్యాయమూర్తి కస్టడి పిటిషన్‌ను ఇవాళ విచారించనున్నారు. ఇక ఈ కేసులో అరెస్టయిన బంజారాహిల్స్‌ ఎస్సై రవీంద్రనాయక్‌.. కొత్త ట్విస్ట్‌ ఇచ్చారు. ఈ కేసును సీఐ డీల్‌ చేయమంటేనే చేశానని ఏసీబీకి చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారులు సీఐ పాత్రపైనా ఆరా తీస్తున్నారు.

Read: కరోనా భయం : ఇంట్లోనే అమ్మకు బోనం