Telangana Assembly : రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. రెండేళ్ల అనంతరం బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు.

Telangana Assembly : తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. రెండేళ్ల అనంతరం బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. రేపు మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ తమిళిసై ప్రసంగించునున్నారు. 2023-24 వార్షిక బడ్జెట్ ను ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. అసెంబ్లీ సమావేశాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
కొత్త సమావేశం కానుండటంతో గత ఏడాది బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేదు. దీనిపై రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం రేగింది. ప్రస్తుంతం కూడా గత సమావేశాలు కొనసాగిస్తూ గవర్నర్ ప్రసంగానికి అవకాశం లేదని మొదట ప్రభుత్వం ప్రకటించింది. కానీ తన ప్రసంగం లేకపోవడంతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై మొదటి అనుమతి ఇవ్వలేదు.
దీనిపై ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు ఇరు పక్షాల న్యాయవాదులు చర్చల అనంతరం రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సయోధ్య కుదిరింది. గవర్నర్ ప్రసంగానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. అందుకనుగుణంగా రేపు ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగనుంది.