Telangana Assembly Budget : అసెంబ్లీలో హరీష్ పాట, చూడు చూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడు బండ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2021, మార్చి 18వ తేదీ గురువారం ఉదయం మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Telangana Assembly Budget : అసెంబ్లీలో హరీష్ పాట, చూడు చూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడు బండ

Telangana Assembly

Minister Harish Rao : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2021, మార్చి 18వ తేదీ గురువారం ఉదయం మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.2,30,825 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపట్టారు. గత ఏడాది కన్నా 20 శాతం అధికంగా ఈసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశ పెడుతూ..మంత్రి హరీష్ రావు ఓ పాట పాడడం విశేషం.

‘చూడు చూడు నల్లగొండ… గుండె మీద ఫ్లోరైడ్ బండ.. బొక్కలొంకరుబోయిన బతుకులా.. మన నల్లగొండ.. దుఃఖమెల్లాదీసేదెన్నాళ్లు’ ఇది నల్లగొండ తాగునీటి కష్టాలను చూసి చలించిన సీఎం కేసీఆర్ స్వయంగా రాసిన పాటని మంత్రి చెప్పారు. ఆనాడు ప్లోరైడ్ దుఃఖంమీద ఆవేదనతో పాట రాసిన ఆయనే ఈనాడు ప్లోరైడ్ పీడను శాశ్వతంగా తొలగించారన్నారు మంత్రి హరీష్.

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ అంతమైందని..ఈ విషయాన్ని స్వయంగా..కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిందనే విషయాన్ని గుర్తు చేశారు. మిషన్ భగీరథ పథకం నల్గొండ ఫ్లోరైడ్ కష్టాలకు చరమగీతం పాడిందని, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఐదు సంవత్సరాల్లో తాగునీటి కష్టాలు తీర్చిందన్నారు. పట్టుదలతో మిషన్ భగీరథ పథకాన్ని వేగంగా పూర్తి చేసిందని, ఇంటింటికి సురక్షిత జలాలు నల్లాల ద్వారా అందుతున్నాయన్నారు.