Telangana Assembly sessions : ఈనెల 12 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ నెల 12 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేశారు.

Telangana Assembly sessions : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ నెల 12 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. గవర్నర్ ప్రసంగంపై రేపు ధన్యవాద తీర్మానం ప్రవేశపడతారు. ఈనెల 6న రాష్ట్ర బడ్జెట్ 2023-24 ఉంటుంది. ఈనెల 7న అసెంబ్లీకి సెలవు. జవనరి 8 నుంచి 12 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి.
రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అని కాళోజీ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ తమిళిసై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి వస్తున్న మద్దతు, ముఖ్యమంత్రి సమర్థవంతమైన పాలన వల్ల, ప్రజా ప్రతినిధుల కృషి, ఉద్యోగుల నిబద్ధత వల్ల రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. ఎన్నో అవరోధాలను అధిగమించి రాష్ట్రం ప్రగతి పథకంలో వెళ్తుందని చెప్పారు.
రాష్ట్రం బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని కొనియాడారు. ఐటీ, ఇతర రంగాల్లో అనేక కంపెనీలను తెలంగాణ ఆకర్షిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందని తెలిపారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ కృషి వల్ల 24 గంటల విద్యుత్తు అందుతోందని చెప్పారు. ప్రతి కుటుంబానికి నల్లా ద్వారా మంచి నీరు అందుతుందన్నారు.