Telangana Assembly: కేసీఆర్ గో పూజలు చేసినా.. తాంత్రిక పూజలని కొందరు అంటున్నారు: అసెంబ్లీలో హరీశ్ రావు

ముఖ్యమంత్రి కేసీఆర్ గో పూజలు చేసినా.. తాంత్రిక పూజలని కొందరు అంటున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ శాసన సభలో తెలంగాణ బడ్జెట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... దేవుడి పట్ల తమకు ఎంతగా భక్తి, నమ్మకం ఉన్నప్పటికీ తాము ఎన్నడూ మతాల పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో తాంత్రిక పూజ కోర్సు అమలు చేసిన ఘటన బీజేపీదని అన్నారు.

Telangana Assembly: కేసీఆర్ గో పూజలు చేసినా.. తాంత్రిక పూజలని కొందరు అంటున్నారు: అసెంబ్లీలో హరీశ్ రావు

Minister Harish Rao

Telangana Assembly: ముఖ్యమంత్రి కేసీఆర్ గో పూజలు చేసినా.. తాంత్రిక పూజలని కొందరు అంటున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ శాసన సభలో తెలంగాణ బడ్జెట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… దేవుడి పట్ల తమకు ఎంతగా భక్తి, నమ్మకం ఉన్నప్పటికీ తాము ఎన్నడూ మతాల పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో తాంత్రిక పూజ కోర్సు అమలు చేసిన ఘటన బీజేపీదని అన్నారు.

బీజేపీకి రైతులంటే కోపమని హరీశ్ చెప్పారు. “అటువంటి తీరు బీజేపీకి ఎందుకు ఉందో మరి” అని వ్యాఖ్యానించారు. నల్ల చట్టాలకు రద్దు చేయాలని అడిగినందుకు రైతులకు ఇచ్చే నిధుల్లో కోతపెడుతున్నారని ఆరోపించారు. రైతుల ఇళ్లకు విద్యుత్ బిల్లులు పంపాలని కేంద్ర ప్రభుత్వం అంటోందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర సర్కారు చెప్పి ప్రకారం ముందుకు వెళ్తే రాష్ట్ర సర్కారుకు భారీగా ఆదాయం వస్తుందని అన్నారు.

అయితే, కేసీఆర్ రైతుల పక్షాన నిలబడి ఆ పని చేయలేదని తెలిపారు. తాము ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణలో 21.50 లక్షల మంది ఆరోగ్య శ్రీ కింద లబ్ధిపొందుతున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు 30 శాతం కాన్పులు మాత్రమే అయ్యేవని, ఇప్పుడు 60 శాతానికి చేరుకున్నాయని చెప్పారు. డయాలసిస్ కేంద్రాలకు మూడు నుంచి 104కు పెంచామని తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులు ప్రతిపక్ష నేతలకు కనపడడం లేదని ఎద్దేవా చేశారు.

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో ట్విస్ట్… అసలు విషయం చెప్పిన స్నేహితుడు