Telangana Assembly : అక్టోబర్‌ 5 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ శాసనసభ సమావేశాలు అక్టోబర్‌ 5 వరకు జరగనున్నాయి. ఏడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే 20 రోజుల పాటు సెషన్స్ కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

Telangana Assembly : అక్టోబర్‌ 5 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

T.assembly (1)

Telangana Assembly sessions : తెలంగాణ శాసనసభ సమావేశాలు అక్టోబర్‌ 5, 2021 వరకు జరగనున్నాయి. మొత్తంగా ఏడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే కాంగ్రెస్ 20 రోజుల పాటు సెషన్స్ కొనసాగించాలనిడిమాండ్ చేసింది. అటు బీఏసీ సమావేశానికి తమను పిలవకపోవడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నెలరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎజెండా ఖరారైంది.

అక్టోబర్‌ 5 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ హజరయ్యారు. అధికార పార్టీ.. ఐటీ, ఇండస్ట్రీ, హరితహారం సహా 13 అంశాలపై చర్చించాలని ప్రతిపాదించింది. అటు కాంగ్రెస్‌ పార్టీ 12 అంశాలపై చర్చించాలని డిమాండ్‌ చేయగా.. MIM ఓల్డ్ సిటీ అభివృద్ధిపై చర్చించాలని కోరింది.

CM KCR : ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌..నెల రోజుల వ్యవధిలో రెండోసారి

ఈ నెల 25న శనివారం, 26న ఆదివారం కావడంతో అసెంబ్లీకి సెలవు ఇచ్చారు. అటు అక్టోబర్‌ 2న గాంధీ జయంతి, అక్టోబర్‌ 3న ఆదివారం కావడంతో సభకు సెలవు దినాలుగా ప్రకటించింది. మొత్తంగా ఏడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గతంలో కరోనా కారణంగా తక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిపామని.. ప్రస్తుతం మహమ్మారి అదుపులో ఉండటంతో సభను ఏడు రోజులు జరపాలని నిర్ణయించింది బీఏసీ. ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయం ఉండనుంది. జీరో అవర్లో సభ్యులకు అవకాశం ఇవ్వనున్నారు.

కొత్త రాష్ట్రం అయిన‌ప్పటికీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో తెలంగాణ శాసనసభ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. స‌భ‌లో ప్రవేశ‌పెట్టే బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని అధికారుల‌కు సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చేరవేయాల‌న్నారు. అర్ధవంతమైన, ముఖ్యమైన అంశం అయితే సభ్యులకు కావాల్సినంత సమయం కేటాయించాలని కేసీఆర్ సూచించారు. విప‌క్ష సభ్యుల సంఖ్య తక్కువ‌గా ఉన్నప్పటికీ సమయం ఎక్కువగానే కేటాయిస్తున్నామన్నారు.

Earthquake : అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో భూకంపం

అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీఏసీలో డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ అవసరమైతే మరో రెండు మూడు రోజులు పొడిగిస్తామన్నారు. అటు టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నిప్పులు చెరిగింది. బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవడంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రాజాసింగ్‌ను బీఏసీ మీటింగ్‌కు పిలిచారని.. ఇప్పుడు ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీలో నిరసన చేపడుతామని తెలిపారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సభ్యులు నివాళులర్పించారు. సంతాప తీర్మానాల అనంతరం ఉభయసభలు సోమవారానికి వాయిదాపడ్డాయి.