Pocharam Srinivas Reddy : పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా..ఆసుపత్రిలో చేరిన స్పీకర్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా నిర్దారణ అయింది. రెగ్యులర్ మెడికల్ చెకప్‌లో భాగంగా బుధవారం రాత్రి కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది.

10TV Telugu News

Pocharam Srinivas Reddy : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా నిర్దారణ అయింది. రెగ్యులర్ మెడికల్ చెకప్‌లో భాగంగా బుధవారం రాత్రి కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా నిర్దారణ అనంతరం పోచారం మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ఆరోగ్యాంగా ఉన్నానని ఎవరు బయపడొద్దని తెలిపారు.

చదవండి : KCR JAGAN : ఒకే వేదికపై కేసీఆర్, జగన్

కాగా నవంబర్ 21న పోచారం శ్రీనివాస్ రెడ్డి మనుమరాలు వివాహం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ హాజరుకాగా వారి పక్కనే కూర్చుని మాట్లాడారు స్పీకర్. సీఎంలతోపాటు ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు ఈ పెళ్లికి హాజరయ్యారు. తనకు పాజిటివ్‌ రావడంతో అందరూ టెస్ట్‌ చేసుకోవాలని, ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ పోచారం కోరారు.

చదవండి : CM KCR : ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్.. మూడు రోజులు అక్కడే..!