Suryapeta : ప్రసవం కోసం వచ్చిన గర్భిణిపై ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారయత్నం

సూర్యాపేట జిల్లా కోదాడలోని తిరుమల ఆసుపత్రికి ఓ గర్భిణి ప్రసవం కోసం వచ్చింది. ఈక్రమంలో టెస్టులు చేయించుకోవటానికి వచ్చిన ఆ గర్భిణీ మీద ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారానికి యత్నించాడు.

Suryapeta : ప్రసవం కోసం వచ్చిన గర్భిణిపై ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారయత్నం

Stone Age Pots,tombs Unearthed (1)

Attempted rape In Suryapeta Hospital : దేశంలో ఒక్కరోజు కూడా ఆడవాళ్లపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరగని రోజంటూ ఉండదా? ఎన్ని చట్టాలు వచ్చినా ఆడపుట్టుకలపై లైంగిక దాడులకు అంతం లేదా? అని ఆందోళన చెందాల్సిన పరిస్థితిలు కొనసాగుతున్నాయి. ఆరు నెలల పసిపాప నుంచి 106 ఏళ్ల వృద్ధురాలిపై కూడా ఇటువంటి దారుణాలు జరుగుతునే ఉన్నాయి. ఆఖరికి కాసేపట్లో ప్రసవించబోయే నిండు గర్భిణీల మీద కూడా అత్యాచారం చేయాలనుకునే వ్యక్తిని ఏమనాలి? రాక్షసుడు అనాలా? కన్నూ మిన్నూ కనిపించని కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుడు అనాలా? అసలు ఇటువంటి దుర్మార్గులను ఏమనాలో కూడా తెలియని పరిస్థిల్లో ఓ ల్యాబ్ టెక్నీషియన్ నిండు గర్భిణీపై అత్యాచారానికి యత్నించిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

సూర్యాపేట జిల్లా కోదాడలోని తిరుమల ఆసుపత్రికి ఓ గర్భిణి ప్రసవం కోసం వచ్చింది. ఈక్రమంలో ఆమెకు పరీక్షలు నిర్వహించటం కోసం డాక్టర్ల కొన్ని టెస్టులు రాశాడు. టెస్టులు చేయించుకోవటానికి వచ్చిన ఆ గర్భిణీ మీద ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారానికి యత్నించాడు. పరీక్షలు చేయలని లోపలికి తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి అత్యంత అసభ్యంగా ప్రవర్తించటంతో ఆమె పెద్ద పెద్దగా కేకలు వేసింది. దీంతో ల్యాబ్ టెక్నీషియన్ శ్రీకాంత్ అక్కడ నుంచి పరారయ్యాడు.

ఆ తరువాత గర్భిణీ కుటుంబ సభ్యులతో కలిసిపోలీసులకు ఫిర్యాదు చేసింది. కరోనా పరీక్షలు చేయాలని లోపలికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని తాను అడ్డుకోవటంతో అత్యాచార యత్నం చేశాడని బాధితురాలు చెప్పటంతో ల్యాబ్ టెక్నీషియన్ శ్రీకాంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు.