20మందితో వెళ్తున్న ఆటో..పందిని ఢీకొట్టి బోల్తా..మహిళ మృతి

  • Published By: nagamani ,Published On : October 31, 2020 / 12:24 PM IST
20మందితో వెళ్తున్న ఆటో..పందిని ఢీకొట్టి బోల్తా..మహిళ మృతి

Telangana : పందిని ఢీకొంటే ఎటువంటి వాహనమైనా సరే బోల్తా కొట్టాల్సిందే.అది ఆటో అయినా..లారీ అయినా సరే. ఓ పందిని ఢీకొన్ని పోలీస్ వాహనం బోల్తా కొట్టి ఎఎస్సై మృతి చెందిన ఘటన నెల్లూ ఆత్మకూరులో జరిగిన విషయం తెలిసిందే. పందిని ఢీకొని విమానమే బోల్తా కొట్టిందంటే పంది పవర్ ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.


ఈక్రమంలో 20మందితో వెళ్తున్న్ ఓ ఆటో పందిని ఢీకొని బోల్తా కొట్టి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలంగాణాలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూరు మండడంలో 20 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న ఓ ఆటో అదుపు తప్పి పందిని ఢీకొట్టింది. వేగంగా వస్తుండడం, పంది కూడా గట్టిది కావడంతో ఆటో తిరబడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.



https://10tv.in/up-55-year-old-woman-killed-for-opposing-sexual-harassment-of-daughters-police/
యములోనిపల్లి నుంచి వ్యవసాయ కూలీలతో వస్తున్న ఆటో వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర వరాహాన్ని ఢీకొట్టింది. ఆ మూగజీవి ఆకస్మికంగా రోడ్డుకు అడ్డంగా రావడంతో డ్రైవర్ తికమకపడి సడన్ బ్రేక్ వేశాడు. ఓ మహిళ అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.


గద్వాల పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో ఆటోలో డ్రైవర్ 20 మంది కూలీలను ఎక్కించుకున్నాడు. పోలీసులు గాయపడినవారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆటో వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గరకు వచ్చేసరికి సడెన్ గా ఓ పంది అడ్డం రావడంతో సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను స్థానిక ఏరియాసుపత్రికి తరలించారు.