Bandi Sanjay : బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది : బండి సంజయ్

హైదరాబాద్ పాత బస్తీని అభివృద్ది చేయని ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తుంటుంది. ఎంఐఎం పార్టీకి చెతకాకనే బిఆర్ఎస్ పార్టీని గెలిపించి పబ్బం గడుపుకుంటోంది అంటూ సెటైర్లు వేశారు. 

Bandi Sanjay : బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది : బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay Fire On BRS and MIM : బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి విమర్శలు సంధించారు. బీఆఎస్ పార్టీ ఓ చేతకాని పార్టీ అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం పార్టీ చేతిలో ఉందంటూ ఎద్దేవా చేశారు.. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఎంఐఎం పార్టీ నేతలు చూస్తున్నారని.. ఎంఐఎం పార్టీకి దమ్ముంటే తెలంగాణ అంతటా పోటీ చేయాలని సవాల్ చేశారు. ఓల్డ్ సిటికి ఎంఐఎం పార్టీ ఏం చెసింది? అని ప్రశ్నించారు.

 

హైదరాబాద్ పాత బస్తీని అభివృద్ది చేయని ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తుంటుందని విమర్శించారు. ఎంఐఎంకు అడ్డాగా ఉన్న పాత బస్తీని ఎందుకు అభివృద్ధి చేయటంలేదు? అని ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలో‌ ఉంటే ఆ పార్టీకి‌ ఎంఐఏం కొమ్ముకాయటంతో తప్ప పాత బస్తీని అభివృద్ధి చేయాలనే ఆలోచనే లేదన్నారు. ఎంఐఎం పార్టీకి చెతకాకనే బిఆర్ఎస్ పార్టీని గెలిపించి పబ్బం గడుపుకుంటోంది అంటూ సెటైర్లు వేశారు.

Bandi Sanjay : ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలు.. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

 

ఎంఐఎం పార్టీ హైదరాబాదు దాటి ఎందుకు పోటి చెయట్లేదు? ఎందుకంటే ఎక్కడా గెలవదు కాబట్టి..ఉగ్రవాదులని పెంచిపోషించే పార్టీ ఎంఐఎం అంటూ ఘాటు విమర్శలు చేశారు బండి సంజయ్. ఎంఐఎం పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని కోరుకుంటోందని దాని కోసమే పనిచేస్తుందని అన్నారు. ముస్లిం సమాజం కోసం కొట్లాడే పార్టీ అయితే తెలంగాణ అంతటా పోటి చెయ్యాలి కదా? మరి ఎందుకు చేయట్లేదు? అని ప్రశ్నించారు.