Telangana : అలయ్ బలయ్, బండి సంజయ్‌తో మాట్లాడిన కవిత..ఫొటో వైరల్

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలు పక్కపక్కనే కూర్చోవడం అందరినీ ఆకర్షించింది.

Telangana : అలయ్ బలయ్, బండి సంజయ్‌తో మాట్లాడిన కవిత..ఫొటో వైరల్

Bandi

Bandi Sanjay And Kavitha : దసరా పండుగ తర్వాత..బండారు దత్తాత్రేయ నిర్వహించే అలయ్ – బలయ్ కార్యక్రమం ఈ సంవత్సరం అట్టహాసంగా జరిగింది. ప్రతి ఏటా ఆయన ఈ కార్యక్రమం నిర్వహించి..రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను పిలుస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. 2021, అక్టోబర్ 17వ తేదీ ఆదివారం నగరంలోని జలవిహార్ లో అలయ్ – బలయ్ కార్యక్రమ జరిగింది. రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వార, పారిశ్రామిక, ఇతర రంగాలకు చెందిన వారు హాజరయ్యారు. కానీ…ఇంత మంది హాజరైనా..అక్కడకు వచ్చిన వారి దృష్టి ఇద్దరిపైనే ఫోకస్ నెలకొంది.

Read More : WBBL Game : వాట్ ఏ క్యాచ్..అమ్మాయి పట్టిన క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా

రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలు పక్కపక్కనే కూర్చోవడం అందరినీ ఆకర్షించింది. కూర్చొని వీరిద్దరూ మాట్లాడుకున్నారు. దీంతో వారు మాట్లాడుతుండగా..తీసిన ఫొటో..సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి, వీవీఐపీలతోపాటు పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చారు.

Read More : SBI e-Auction: ఎస్బీఐ ఈ వేలం తెలుసా.. ఆస్తులు కొనాలనుకుంటే ఇలా చేయండి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ తమిళిసై, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌తోపాటు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, మా అధ్యక్షుడు మంచు విష్ణు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతియేటా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా…  ప్రస్తుతం ఆయన హర్యానా గవర్నర్‌గా ఉండటంతో ఈసారి దత్తాత్రేయ కుమార్తె నేతృత్వంలో ఈ ప్రోగ్రాం జరిగింది.

Read More : Instagram : మార్క్ జుకర్ బెర్గ్‌కు కొత్త టెన్షన్.. వారి కోసం వేల కోట్లు ఖర్చు

జలవిహార్‌లో జరిగిన అలయ్ బలయ్‌లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రాలను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం… అతిథులందరూ దుర్గామాత, జమ్మిపూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు కార్యక్రమానికి హాజరైన వారు అంబలి సేవించారు.