Bandi Sanjay : కవితను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ పాట్లు పడుతున్నారు-బండి సంజయ్

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తిరుమలగిరిలో మాట్లాడిన బండి సంజయ్.. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇచ్చిన 2 లక్షల ఇళ్లను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నాణ్యత లేని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభానికి ముందే కూలిపోతున్నాయని ఆరోపించారు.

Bandi Sanjay : కవితను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ పాట్లు పడుతున్నారు-బండి సంజయ్

Bandi Sanjay : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తిరుమలగిరిలో మాట్లాడిన బండి సంజయ్.. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇచ్చిన 2 లక్షల ఇళ్లను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నాణ్యత లేని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభానికి ముందే కూలిపోతున్నాయని ఆరోపించారు.

రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు మొండి చేయి చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని విమర్శించారు. రైతు, పేదల ద్రోహి బీఆర్ఎస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. ఆర్టీసీ ఛార్జీలు, ఆస్తి పన్ను, భూమి పన్నులు పెంచుతూ.. గ్యాస్ ధర పెరిగిందని కేసీఆర్ ప్రభుత్వం గగ్గోలు పెడుతోందని ధ్వజమెత్తారు. కేసుల పాలు కాకుండా బిడ్డను కాపాడుకోవడం కోసం కేసీఆర్ పడరాన్ని పాట్లు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు.

Also Read..Opposition Letter PM Modi : కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మనీశ్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ.. ప్రధాని మోదీకి విపక్షాలు లేఖ

రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా 3 సమస్యలు ప్రధానంగా వినిపడుతున్నాయని బండి సంజయ్ చెప్పారు. అవి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ధరణి , రుణ మాఫీ అని చెప్పారు. రాత్రి 1 గంట తర్వాతనే ధరణి పోర్టల్ తెరుచుకుంటుందని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మద్యం అమ్మకాలపైనే ఆధారపడిందన్నారు. కేసీఆర్ కుమార్తె కూడా మద్యం వ్యాపారం పైనే ఆధారపడిందన్నారు.

Also Read..Komatireddy Rajagopal Reddy : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లక తప్పదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుండి తన కుమార్తెను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారని బండి సంజయ్ అన్నారు. లిక్కర్ స్కామ్ చార్జి షీట్ లో కవిత పేరు నాలుగు సార్లు వచ్చిందన్నారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కి భయపడదన్నారు. పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు కూడా ఫోర్జరీ సంతకాలు పెట్టిన చరిత్ర కేసీఆర్ ది అని బండి సంజయ్ విమర్శించారు.