Etela Rajender BJP : తెలంగాణలో బీజేపీ విస్తరణకు ప్రయత్నిస్తా – ఈటల

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ విస్తరణకు తాను ప్రయత్నిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. పార్టీ ఇచ్చిన పనిని పూర్తి చేయడం జరుగుతుందని, రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తామన్నారు. పార్టీని పటిష్టస్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు.

Etela Rajender BJP : తెలంగాణలో బీజేపీ విస్తరణకు ప్రయత్నిస్తా – ఈటల

Tbjp

Etela Rajender : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ విస్తరణకు తాను ప్రయత్నిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. పార్టీ ఇచ్చిన పనిని పూర్తి చేయడం జరుగుతుందని, రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తామన్నారు. పార్టీని పటిష్టస్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. బీజేపీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానన్నారు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల నుంచి బీజేపీలోకి చేరికలుంటాయని వెల్లడించడం గమనార్హం. తనను చేర్చుకున్నందుకు బీజేపీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.

దానికంటే ముందు…కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే అధికారమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారనట్లు తెలిపారు.

2021, జూన్ 14వ తేదీ సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఈటల ఢిల్లీకి వెళ్లారు. పార్టీలో చేరిన వారికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ తరుణ్ చుగ్ పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఈటలతో పాటు.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి సహా.. మరికొందరు నాయకులు.. కాషాయ కండువా కప్పుకున్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి ఈటెల రాజేందర్ బృందం వెళ్లనుంది.

Read More : Sushant Singh Rajput : రియల్ లైఫ్‌లో ఎందుకు హీరో కాలేకపోయాడు..?