ఎస్‌ఈసీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలా మారింది : బండి సంజయ్

ఎస్‌ఈసీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలా మారింది : బండి సంజయ్

Bandi Sanjay met the governor Tamilasai : ఎస్‌ఈసీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలా మారిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. ప్రజా నిర్ణయాన్ని ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లతో ప్రమాణస్వీకారం ఎందుకు నిర్వహించడం లేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

జీహెచ్‌ఎంసీ కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ శుక్రవారం (జనవరి 1, 2021) గవర్నర్‌ తమిళసైను కలిశారు. కొత్తగా గెలిచిన కార్పోరేటర్లను గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశాలని గవర్నర్‌ను కోరారు. జీహెచ్‌ఎంసీ కొత్త పాలకవర్గంపై చర్చించారు.

అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ మేయర్ ఎన్నికను ఎందుకు నిర్వహించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోట్లు ఇస్తామంటూ తమ కార్పొరేటర్లకు ఫోన్లు చేస్తున్నారని ఆరోపించారు. 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. 2023లో తెలంగాణలో బీజేపీదే అధికారం ధీమా వ్యక్తం చేశారు.