Bandi Sanjay: సీఎం కేసీఆర్ కు బండి కౌంటర్, 11 హామిలు నెరవేర్చాలని డిమాండ్
భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. గతంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులకు ఇచ్చిన హామీలలో 11 హామీలను ప్రస్తావిస్తూ సంజయ్ ఈ లేఖ రాశారు

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వవిధానాలతో రైతులకు నష్టం కలుగుతుందంటూ బుధవారం సీఎం కేసీఆర్ ప్రధాని మోదికి లేఖ రాసిన నేపథ్యంలో.. అందుకు ప్రతిగా భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. గతంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులకు ఇచ్చిన హామీలలో 11 హామీలను ప్రస్తావిస్తూ సంజయ్ ఈ లేఖ రాశారు. కేంద్రాన్ని ప్రశ్నించే ముందు రాష్ట్రంలో రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఈసందర్భంగా బండి సంజయ్ ప్రశ్నించారు. జీవో 317 అంశన్ని పక్కదారి పట్టించేందుకే ఎరువుల అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారని బండి సంజయ్ విమర్శించారు.
Also Read: Fake Call Center: అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ ముఠా గుట్టురట్టు
బండి సంజయ్ బహిరంగ లేఖ ప్రకారం:
1. 2017 ఏప్రిల్ 13న మీరు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా ఎరువులను సరఫరా చేయాలి.
2. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలి.
3. వడ్లు, పత్తి, మొక్కజొన్నసహా రాష్ట్రంలో రైతులు పండించే పంట ఉత్పత్తులకు క్వింటాల్ కు రూ.500 చొప్పున ‘బోనస్’ ప్రకటించాలి.
4. కేంద్రం కేటాయించిన నిధులను తక్షణమే ఖర్చు చేసి రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించడంతోపాటు పంటల ప్రణాళికను ప్రకటించాలి.
5. వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీలను తక్షణమే అమలు చేయాలి. పార్టీ కార్యకర్తలకు గాకుండా అర్హులైన రైతులకు మాత్రమే వాటిని అందించాలి.
6. గతంలో ఇచ్చిన హామీ మేరకు పాలీహౌజ్ సబ్సిడీని పునరుద్దరించాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు అదనపు పాలీహౌజ్ ల నిర్మాణానికి ప్రోత్సాహకం అందించాలి.
7. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలి.
8. విత్తన సబ్సిడీని పూర్తిగా అమలు చేయాలి. నకిలీ విత్తనాలను పూర్తిగా అరికట్టాలి.
9. అకాల వర్షాలకు నష్టపోతున్న రైతాంగానికి ఆదుకునేందుకు ‘క్రాప్ ఇన్సూరెన్సు’ పథకాన్ని అమలు చేయాలి.
10. మార్కెట్లో ‘ఈ-నామ్’ పద్దతిని ప్రవేశపెట్టి రైతులకు మేలు చేయాలి.
11. బిందు సేద్యంలో భాగంగా ఎస్సీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి.
సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన ఈ హామీలను నెరవేర్చాలని మొత్తం 6 పేజీలు కలిగిన బహిరంగ లేఖలో బండి సంజయ్ వివరించారు.
Also read: UP Election 2022 : బీజేపీకి షాక్‌లు…ఉత్సాహంలో సమాజ్‌వాది పార్టీ
- TRS Rajyasabha: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
- CM KCR : రాజ్యసభ అభ్యర్థులపై నేడు సీఎం కేసీఆర్ నిర్ణయం..ఆశావహుల్లో ఉత్కంఠ
- RevanthReddy Letter To KCR : ఐదేళ్లకు పెంచండి, లేదంటే 4లక్షల మంది నష్టపోతారు-సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి లేఖ
- Budda Vanam : తెలంగాణ బుద్ధుని మార్గంలో పయనిస్తోంది : సీఎ కేసీఆర్
- PM Modi Calls BandiSanjay : బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. శభాష్ అంటూ ప్రశంసల వర్షం
1IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
2Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
3IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
4Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే
5NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
6She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు
7Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
8Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు
9Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్.. ఆందోళనలో అభ్యర్థులు
10Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!