Bandi Sanjay Kumar : బండి సంజయ్ పాదయాత్ర.. మొదటి విడతలో 55 రోజులు!

తెలంగాణలో త్వరలో పాదయాత్రల పర్వం మొదలు కానుంది. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు బీజేపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మేరకు ఆగస్టు 9న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర మొదలు కానుంది. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్ర మొదలు పెట్టనున్నారు సంజయ్.

Bandi Sanjay Kumar : బండి సంజయ్ పాదయాత్ర.. మొదటి విడతలో 55 రోజులు!

Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar : తెలంగాణలో త్వరలో పాదయాత్రల పర్వం మొదలు కానుంది. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు బీజేపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మేరకు ఆగస్టు 9న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర మొదలు కానుంది. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్ర మొదలు పెట్టనున్నారు సంజయ్.

ఈ పాదయాత్రలో పార్టీ ముఖ్యనేతలు కూడా పాల్గొననున్నారు. ఇక నాలుగైదు విడతల్లో పాదయాత్ర చేయాలనీ తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మొదటి విడతలో రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేపడతారు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ఆగస్టు 9నే బండి మొదటి విడత పాదయాత్ర మొదలవుతుంది. ఈ పాదయాత్ర అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ముగుస్తుంది.

మొదటి విడతలో 55 రోజులపాటు 750 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు సంజయ్.. అసెంబ్లీ ఎన్నికల వరకు అనగా రానున్న రెండున్నరేళ్లు పాదయాత్రలే ఉండే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొదటి విడత పాదయాత్ర పాతబస్తీ, ఆర్యమైసమ్మ, మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, సదాశివపేట, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేట, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బెజ్జంకి, హుస్నాబాద్ మీదుగా హుజురాబాద్ వరకు కొనసాగుతుంది. ఇక్కడే మొదటి విడత పాదయాత్ర పూర్తవుతుంది.