TS BJP Bandi Sanjay : ‘కట్టు తప్పిదే వేటు తప్పదు‘ పార్టీ అసమ్మతి నేతలకు బండి సంజయ్ వార్నింగ్

బీజేపీ క్రమ శిక్షణ గల పార్టీ అని..సీనియర్ నేతలు కూడా పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేయాలని..‘కట్టు తప్పిదే వేటు తప్పదు‘ అంటూ పార్టీ అసమ్మతి నేతలకు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.

TS BJP Bandi Sanjay : ‘కట్టు తప్పిదే వేటు తప్పదు‘ పార్టీ అసమ్మతి నేతలకు బండి సంజయ్ వార్నింగ్

Ts Bjp Bandi Sanjay

TS BJP Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పదాధికారులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ అసమ్మతి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బండి ఏది మాట్లాడినా ముక్కు సూటిగా మాట్లాడే తీరుతోనే స్వపార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో పనిచేసే నేతలంతా పార్టీకి ‘కట్టుబడే’ ఉండాలని ఈ ‘కట్టు తప్పితే వేటు తప్పదు’అంటూ బీజేపీ అసమ్మతి నేతలకు బండి డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో సీనియర్ నేతలు అయినా సరే పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు లోబడే పనిచేయాలని లేదంటే వేటు తప్పదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ అత్యంత క్రమశిక్షణ కగల పార్టీ అనే విషయం నేతలకు తెలుసు..తెలిసి కూడా తోక జాడిస్తే వేటు తప్పదు అని హెచ్చరించారు. ఇది సీనియర్లు అయినా జూనియర్లు అయినా తప్పదని..కట్టు తప్పితే ఎంతటివారైనా సరే వేటుకు గురి కాక తప్పదన్నారు.

Also read : Telangana : ‘మీరు నశం పెడితే..మేం జండూ బామ్ రాస్తాం’..కేసీఆర్ వ్యాఖ్యలకు బండి కౌంటర్..

హద్దు మీరి..పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే వేటు తప్పదు : బండి
తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందని దాన్ని మరింతగా జాగ్రత్తగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిమీదా ఉందని గుర్తుంచుకోవాలని…పార్టీ తెలంగాణాలో అధికారంలోకివచ్చే సమయంలో ఎవరైనా హద్దు మీరి..పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే వేటు తప్పదంటూ హెచ్చరించారు. ఈ అత్యంత కీలక సమయంలో నేతలంతా సమన్వయంతో పని చేస్తే పార్టీ పట్ల విధేయత చూపించాలని..ఏమాత్రం హద్దు మీరినా ఏమాత్రం సహించేది లేదని స్పష్టంచేశారు. తప్పుడు మాటలు విని అతిగా వ్యవహరిస్తే రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదని గుర్తుంచుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు.అలాగే తెలంగాణలో పట్టు సాధిస్తున్న సమయంలో ప్రతీ ఒక్కరూ పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేయాలని..లేదంటే రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. ఏ పార్టీలో అయినా కొంతమంది అసమ్మతితో ఉంటుంటారని..అటువంటివారు పనిచేయరు..చేసేవారిని చెడగొడుతుంటారని..ఏదో అక్కసు కడుపులో పెట్టుకుని చెప్పుడు మాటలు చెబుతుంటారని అటువంటి వ్యక్తులను గుర్తించి వారి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరి మానాన వారు పార్టీ కోసం పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు.

అలాగే తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి అసంతృప్తి నాయకులను బుజ్జగించి వారి అసంతృప్తికి గల కారణమేంటి. అని చూడాలని బీజేపీ అధిష్టానం సూచించింది. సంతప్తి నేతలను సమన్వయంచేసే బాధ్యతను ఇంద్రసేనారెడ్డికి అప్పగించేలా చూడాలని బండి సంజయ్ సూచించారు. సదరు అసంతృప్తి నేతలకు గల కారణాలేంటో తెలుసుకోవాలని సూచించారు.కాగా..తెలంగాణలో బీజేపీ కాస్త కాస్తగా పుంజుకుంటోంది. తాజాగా టీఆర్ఎస్ లోంచి బీజేపీ గూటికి చేరి..అక్కడ కూడా టిక్కెట్ దక్కించుకుని మరోసారి విజయం సాధించారు ఈటల రాజేందర్. మరి అది రాజేందర్ విజయమా? బీజేపీ విజయమా?అంటే రెండూ అని చెప్పాలేమో.తెలంగాణలో బండి సంజయ్ విజయం..తరువాత హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ విజయంతో బీజేపీ మరింతగా పట్టు సాధిస్తోందా? అనే అంశం ఆసక్తిరకంగా మారింది.

Also read :  CM KCR: బండి సంజయ్… నన్ను టచ్ చేసి చూడు.. బిడ్డా బతుకుతావా? -కేసీఆర్

హుజూరాబాద్ లో ఓట‌మితో తెలంగాణ‌లో బీజేపీ టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో అడుగు ముందుకు వేసిన‌ట్టేనా? అనే ప్రశ్నలు ఉద్భవించాయి. టీఆర్ఎస్ ను ఓడించి రేప‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి అధికారం అప్ప‌గించ‌డానికి ప్ర‌జ‌లు రెడీ అవుతున్న‌ట్టేనా? అనేవి ప్ర‌శ్న‌లుగా వస్తున్న పరిస్థితిని బీజేపి తనకు అనుకూలంగా మార్చుకోవటానికి పావులు కదుపుతోంది.. ఇప్ప‌టికే తెరాస ను ఓడించి తాము అధికారం చేప‌డ‌తామ‌ని బీజేపీ తెలంగాణ నేత‌లు అనేక సార్లు ప్ర‌క‌టించుకున్నారు. అన్నట్లుగానే ఈటలను గెలిపించుకున్నారు.

Also read :  KCR-Kishan Reddy : మోదీ పాలనపై చర్చించేందుకు సిద్ధం..కేసీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా: కిషన్ రెడ్డి

హుజూరాబాద్ లో గెలుపు బీజేపీ ది మాత్ర‌మే కాదు. ఈటల రాజేంద‌ర్ అభ్య‌ర్థిత్వ‌మే అక్క‌డ జ‌యాప‌జ‌యాల‌ను నిర్దేశించింది. ఒక‌వేళ బీజేపీ త‌ర‌ఫున కాకుండా.. ఈట‌ల రాజేంద‌ర్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉన్నా, లేక కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఉన్నా.. దాదాపు ఇదే ఫ‌లితం వ‌చ్చేద‌ని స్ప‌ష్టమవుతోంది. అక్క‌డ ఈట‌ల రాజేంద‌ర్ ను చూసి క‌మ‌లం గుర్తుకు ఓటు ప‌డింది త‌ప్ప‌, క‌మ‌లం గుర్తును చూసి ఈట‌ల‌కు ఓటు ప‌డ‌లేద‌నేది కొంతమంది వాదన..ఏది ఏమైనా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా చిన్న గాలి వీచినా దాన్ని ఒడిసి పట్టుకుంటోంది బీజేపీ. అదే ఈటల రాజేందర్ ను తమ పార్టీలోకి చేేర్చుకుని హూజూరాబాద్ లో టీఆర్ఎస్ ను దెబ్బకొట్టింది.అక్కడ ఈటలకు మంచి పట్టుందనే విషయం బీజేపికి తెలుసు. అలాగే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న ప్రతీ చిన్న విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో సఫలీకృతమవుతోంది బీజేపీ.ఈక్రమంలో మరింతగా పట్టు బిగించి తెలంగాణలో అధికారంలోకి రావాలని కాషాయ దళం యోచన..మరి ఇది ఎంత వరకు సఫలం అవుతోంది వేచి చూడాల్సిందే.

Also read : Telangana : బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తారు : కేటీఆర్