Bandi Sanjay : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో కోవర్టులు లేరని బండి స్పష్టం చేశారు. బీజేపీ సిద్ధాంతం గల పార్టీ అని అన్నారు. కోవర్టులున్నారని ఈటల రాజేంందర్ చెప్పారనుకోవడడం లేదని పేర్కొన్నారు.

Bandi Sanjay : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay

Bandi Sanjay : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో కోవర్టులు లేరని బండి స్పష్టం చేశారు. బీజేపీ సిద్ధాంతం గల పార్టీ అని అన్నారు. కోవర్టులున్నారని ఈటల రాజేంందర్ చెప్పారనుకోవడడం లేదని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సవాల్పై నా బండి సంజయ్ స్పందించారు. ముందుస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.

ఇటీవల బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ మనుషులు అన్ని పార్టీలల్లో ఉన్నారని పేర్కొన్నారు. అన్ని పార్టీల్లో వారి ఎజెండాలను అమలు చేసేవారున్నారని వెల్లడించారు. వారే లీకులు ఇస్తుంటారు, వారే రాయి వేస్తుంటారని, ముందుకు పొనియ్యరని పేర్కొన్నారు. ఆయన గొప్పగా ఎదిగే ప్రయత్నం చేయరని కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఇతర పార్టీలను ఎదగకుండా చేసి అనివార్యతను సృష్టించి రాజ్యమేలుతున్నవంటి వ్యక్తి దేశంలో కేసీఆర్ మాత్రమేనని అన్నారు. ఇప్పుడు ఈటల మాటలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

Bandi Sanjay : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేసీఆర్ ప్రమేయం-బండి సంజయ్ సంచలన ఆరోపణలు

ఈటల వ్యాఖ్యలపై బీజేపీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  అసలు బీజేపీలో కోవర్డులు ఎవరున్నారు? కేసీఆర్ మనుషులు ఎవరున్నారు? వారి పేర్లు కూడా డిస్కస్ చేయాలని పార్టీలో అంతర్గతంగా కొంత చర్చ నడుస్తోంది. కొంతమంది నేతల కూడా ఆరా తీస్తున్నారు. ఏయే మీటింగ్ ల్లో ఎవరెవరు కూర్చున్నారు? ఏం జరిగింది? ఏయే అంశాలు బయటికెళ్లాయిఝ? నిజంగా కోవర్టులు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ కోర్టులు ఉంటే ఈటల రాజేందర్ చెప్పాల్సిన అవసరముందంటూ కొంతమంది నేతలు అంతర్గతంగా మాట్లాడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతం ఉన్న పార్టీ అన్నారు. బీజేపీలో కోవర్టులు లేవరని.. అందరూ సిద్ధాంతం కోసం పని చేసేవారు మాత్రమే ఉంటారని పేర్కొన్నారు. దీంతో ఇద్దరు అగ్రస్థాయి నేతలు పార్టీలో కామెంట్స్ చేయడం కొంత గందరగోళానికి, కార్యకర్తల్లో కూడా అయోమయం సృష్టించే అవకాశమైతే లేకపోలేదని చెప్పవచ్చు.