Telangana Budget : కేంద్రం వివక్ష చూపిస్తోంది.. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీష్ రావు

అసెంబ్లీ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని దుయ్యబట్టారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, ఇవన్నీ ప్రజలకు...

Telangana Budget : కేంద్రం వివక్ష చూపిస్తోంది.. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీష్ రావు

TS Budjet

Telangana Budget 2022-23 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి 2022, మార్చి 07వ తేదీ సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తొలిసారిగా గవర్నర్ ప్రసంగం లేకుండా ముందుగానే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని దుయ్యబట్టారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, ఇవన్నీ ప్రజలకు అందుతున్నాయన్నారు. ఆయా పథకాలకు సంబంధించిన డబ్బులను వారి వారి ఖాతాల్లో వేయడం జరుగుతోందని, ఖాతాల్లో గంట కొట్టి మరి తెలియచేస్తున్నాయి.

Read More : Telangana Budget Live Updates: తెలంగాణ బడ్జెట్ 2022 – 23 లైవ్ అప్ డేట్స్

పదే పదే సీఎం కేసీఆర్ నాయకత్వం, ప్రభుత్వం పట్ల ప్రజలు ఆదరణ చూపిస్తున్నారు. ఇదే సభలో పేగులు తెగేదాక కొట్లాడడం జరిగిందని గుర్తు చేశారు. సాగునీరు, తాగునీరు, ఆకలి చావులు, కరెంటు కోతలు..ఇలా ఎన్నో సమస్యల విలయంలో కొట్టుమిట్టాడిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్లిందన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, అభివృద్ధిలో దూసుకపోతోందన్నారు. నేడు తెలంగాణ ఆచరించింది..రేపు దేశం అనుసరిస్తోంది. ఇందుకు ఏడేండ్ల సాక్ష్యం. ఖజానాకు ఎంత ధనం వచ్చిందనేది కాదు.. అవి ప్రజలకు చేరడమే ముఖ్యమన్నారు.

Read More : Telangana Budget : తెలంగాణ బడ్జెట్ రూ. 2.70 లక్షల కోట్లు ? అంచనాలు

ఇంకా వివక్ష జరుగుతోందని, కేంద్ర వైఖరి కాళ్లలో కట్టలు పెట్టే విధంగా ఉందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకొక ముందే.. ఖమ్మంలోని ఏడు మండలాలను ఏపీకి కట్టబెట్టిందన్నారు. ఐదేళ్ల పాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసిందని, విభజన చట్టంలో పేర్కొన్న హామీలను ఇంకా అమలు చేయడం లేదన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని పదే పదే వ్యాఖ్యానిస్తూ.. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. ఐటీఐఆర్ ను అమలు చేసి ఉంటే… లక్షలాది మంది ఉపాధి జరిగి ఉండేదన్నారు. జిల్లాలకు నిధులు కేటాయింపు విషయంలో ఆలస్యం చేస్తూ వస్తోందని, రాష్ట్రాల అధికారాలను కబలిస్తోందని దుయ్యబట్టారు.