Telangana Budget 2023-24 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ .. 80వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు ప్రక్రియ షురూ..

ఇప్పటి వరకు లక్షా 41, 735 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయటం జరిగిందని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన మంత్రి హరీష్ రావు మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని దీంట్లో భాగంగానే కొత్తగా 80వేల 39 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించామి ప్రకటించారు. కొత్త ఉద్యోగాల వేతనాల కోసం రూ. వెయ్యి కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Telangana Budget 2023-24 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ .. 80వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు ప్రక్రియ షురూ..

Telangana Budget 2023-24

Telangana Budget 2023-24 : 2023-24 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రభుత్వం బాహుబలి బడ్జెట్ గా అభివర్ణించింది. ఈ బడ్జెట్ లో ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు లక్షా 41, 735 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయటం జరిగిందని వెల్లడించిన మంత్రి హరీష్ రావు మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని దీంట్లో భాగంగానే కొత్తగా 80వేల 39 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించామి ప్రకటించారు. కొత్త ఉద్యోగాల వేతనాల కోసం రూ. వెయ్యి కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సొంత రాష్ట్రం సాధించుకున్నాక ప్రజా సంక్షేమమే లక్ష్యంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారని తెలిపిన మంత్రి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని దీంట్లో భాగంగానే భారీ బడ్జెట్ ను తీసుకొచ్చామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ పథకాలతో పాటు 24 గంటల విద్యుత్ అందిస్తూ రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని అన్నారు మంత్రి. రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకురావటమేకాదు.. సాగునీటి కోసం ఎన్నో ప్రాజెక్టులన్ని నిర్మించిందని..ఈ బడ్జెట్ లో ఇరిగేషన్‌కు రూ, 26, 885 కోట్లు కేటాయించామని ప్రటించారు.

శాఖలు..కేటాయింపులు ఇలా..
ఇరిగేషన్‌కు రూ, 26, 885 కోట్లు.
విద్యుత్‌ శాఖకు రూ. 12, 727 కోట్లు..
ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ, 3117 కోట్లు..
ఆసరా పెన్షన్లకు రూ. 12 వేల కోట్లు..
దళిత బంధుకు రూ. 17, 700 కోట్లు..
షెడ్యూల్డ్ కులాల ప్రగతి కోసం రూ. 36, 750 కోట్లు..
బిసీ సంక్షేమానికి రూ. 6, 229 కోట్లు..
కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ కోసం రూ. 3210 కోట్లు..
మహిళా, శిశు సంక్షేమానికి రూ. 2131 కోట్లు..
మైనార్టీ సంక్షేమానికి రూ.2200 కోట్లు..
తెలంగాణ హరిత హారం, అటవీశాఖకు రూ. 1471 కోట్లు..
వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 12, 161 కోట్లు..
పంచాయతీ రాజ్‌ శాఖకు రూ. 31, 426 కోట్లు..
కేసీఆర్‌ కిట్లకు రూ. 200 కోట్లు..
విద్యాశాఖకు రూ. 19,093 కోట్లు..
పురపాలక శాఖకు రూ. 11, 372 కోట్లు..
రూ. 6, 250 కోట్లతో ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు..
మున్సిపల్‌ శాఖకు రూ. 11, 372 కోట్లు..
రోడ్లు, భవనాల శాఖకు రూ. 2500 కోట్లు..
పరిశ్రమల శాఖకు రూ. 4037 కోట్లు….
హోంశాఖకు రూ. 9599 కోట్లు..