ఏటా పెరుగుతున్న తలసరి అప్పు

  • Published By: veegamteam ,Published On : March 9, 2020 / 02:06 AM IST
ఏటా పెరుగుతున్న తలసరి అప్పు

తెలంగాణ రాష్ట్ర ప్రజలపై అప్పుల మోత మోగుతోంది. తలసరి అప్పు ప్రతీసంవత్సరం పెరిగిపోతునే ఉంది. ప్రాధాన్య కార్యక్రమాలతో పాటు మూలధన వ్యయం కింద వెచ్చించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం FRBM చట్టానికి లోబడి తీసుకొస్తున్న అప్పులు పెరిగి పోతుండటంతో తలసరి అప్పు పెరుగుతోందని బడ్జెట్‌ లెక్కలు చెపుతున్నాయి. బడ్జెట్‌ అంచనాల ప్రకారం 2020 నుంచి 21లోగా ప్రభుత్వం చేసిన అప్పులు  రూ. 2.29 లక్షల కోట్లకు చేరుతాయి. 
  

బడ్జెట్​లో ఆర్థిక శాఖ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇరిగేషన్​ ప్రాజెక్టులు, మిషన్‌‌ భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిట ఇప్పటికే రూ. 89,600  కోట్ల రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చింది. కార్పొరేషన్ల పేరిట తీసుకున్న ఈ అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత చివరికి రాష్ట్ర  ప్రభుత్వంపైనే ఉంటుంది. బడ్జెట్​లో పెట్టకుండా చేసిన ఈ అప్పులన్నీ ఏటా తడిసి మోపెడవుతున్నాయి. వీటిని సైతం రాష్ట్రం అప్పుల ఖాతాలో జమ కడితే మొత్తం అప్పు రూ. 3,18,600 కోట్లు అవుతుంది. నిబంధనల ప్రకారం రాష్ట్ర అప్పు జీఎస్‌‌డీపీలో 25 శాతం మించకూడదు. అంతకు మించితే ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాల జాబితాలో చేరి పోయే ప్రమాదం ఉంటుంది.(గ్రేటర్ ఎన్నికలకు వేళాయే! : హైదరాబాద్‌కు నిధుల పంట)

అప్పుల వివరాలు…

       ఏడాది        అప్పు   

            డీఎన్‌డీపీలో అప్పుల శాతం

    2017-18      1,52,190                         20.21
    2018-19    1,75,281                         20.25
    2019-20    1,99,215                             20.55
    2020-21    2,29,205                         20.74