Dussehra-2022 rush: బస్, రైల్వే స్టేషన్లలో ఇసుకేస్తే రాలనంత జనం.. తీవ్ర ఇబ్బందులు

దసరా పండుగ నేపథ్యంలో బస్, రైల్వే స్టేషన్లలో ఇసుకేస్తే రాలనంత జనం కనపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్సులు, రైళ్లలో నిలబడి వెళ్లడానికి కూడా చోటు దొరకడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నప్పటికీ అవి సరిపోవడం లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు రైళ్లు వచ్చే వేళలకు రెండు, మూడు గంటల ముందుగానే ప్రయాణికులు అక్కడకు చేరుకుని, ప్లాట్ ఫాంపై నిలబడుతున్నారు.

Dussehra-2022 rush: బస్, రైల్వే స్టేషన్లలో ఇసుకేస్తే రాలనంత జనం.. తీవ్ర ఇబ్బందులు

Dussehra-2022 rush: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్ లోని బస్, రైల్వే స్టేషన్లలో ఇసుకేస్తే రాలనంత జనం కనపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్సులు, రైళ్లలో నిలబడి వెళ్లడానికి కూడా చోటు దొరకడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నప్పటికీ అవి సరిపోవడం లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు రైళ్లు వచ్చే వేళలకు రెండు, మూడు గంటల ముందుగానే ప్రయాణికులు అక్కడకు చేరుకుని, ప్లాట్ ఫాంపై నిలబడుతున్నారు.

ప్రయాణికులు రైలు వచ్చే సమయానికి కాకుండా మూడు గంటలు ముందుగానే వస్తుండడంతో రద్దీ పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు అంటున్నారు. మరోవైపు, ప్రత్యేక రైళ్లకు తత్కాల్ చార్జీలను వసూలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ​ఆర్టీసీ 4,198 ప్రత్యేక బస్సులను నడుపుతోన్న విషయం తెలిసిందే.

నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌ నగర్, లింగంపల్లి, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్ వంటి బస్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రైవేటు బస్సుల్లో ఎప్పటిలాగే దోపిడీ కొనసాగుతోంది. బస్సు టికెట్ల ధరలను అమాంతం పెంచేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..