Telangana Cabinet, BRS Meeting : తెలంగాణ కేబినెట్, బీఆర్ఎస్ సమావేశాలు.. కవితకు ఈడీ నోటీసులతో ప్రాధాన్యత

మార్చి9న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే మార్చి10న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Telangana Cabinet, BRS Meeting : తెలంగాణ కేబినెట్, బీఆర్ఎస్ సమావేశాలు.. కవితకు ఈడీ నోటీసులతో ప్రాధాన్యత

Telangana Cabinet

Telangana Cabinet, BRS Meeting : మార్చి9న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే మార్చి10న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ సహా రాష్ట్ర కార్యవర్త సంయుక్త సమావేశం జరుగబోతుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటు పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. కవితకు ఈడీ నోటీసులతో కేబినెట్, బీఆర్ఎస్ మీటింగ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. మార్చి10న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం కూడా జరుగబోతుంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో మార్చి9న జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను అధికారులు విచారించబోతున్నారు. ఈ కేసులో గతంలోనే ఈడీ కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో విచారించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, ముడుపుల అంశం వంటి అంశాలపై కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి గతంలో దాఖలు చేసిన చార్జిషీటులో రామచంద్ర పిళ్లై పాత్రను ఈడీ ప్రస్తావించింది.

MLC Kavitha Letter ED : ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. మార్చి11న విచారణకు హాజరవుతా

పిళ్లైపై అనేక అభియోగాలు నమోదు చేసింది. కవిత తరఫున అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకున్నారని చార్జిషీటులో ఈడీ పేర్కొంది. ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జిషీటులో కూడా ఈడీ కవిత పేరును ప్రస్తావించింది. మరోవైపు ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల జారీ చేయడంపై తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. మార్చి9న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. ఈ మేరకు ఈడీకి ఎమ్మెల్సీ కవిత ఒక లేఖ రాశారు. మార్చి 11న విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. మార్చి 9న ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేనని కవిత తెలిపింది.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక వ్యక్తి అరెస్టు

అయితే హడావిడి విచారణపై ఈడీని కవిత నిలదీసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడీ కార్యాలయానికి రమ్మనడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దర్యాప్తు పేరుతో రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రస్తుత దర్యాప్తుతో తాను చేసేదేమీ లేదని చెప్పారు. రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.