Telangana : తెలంగాణలో లాక్ డౌన్ పెడుతారా..కేబినెట్ సమావేశంలో నిర్ణయం

Telangana : తెలంగాణలో లాక్ డౌన్ పెడుతారా..కేబినెట్ సమావేశంలో నిర్ణయం

Telangana Lock Down

Cabinet Meeting : తెలంగాణలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021, మే 11వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 02 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు.

ప్రధానంగా లాక్ డౌన్ అంశంపై చర్చించనున్నారు. కరోనా పరిస్థితులపై కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. లాక్ డౌన్ విధిస్తే..ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం ఏ మేరకు ఉంటుందనే అంశంపై కేబినెట్ చర్చించనుంది.

భారతదేశంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అధికంగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండడంతో కఠిన ఆంక్షలు నమోదు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించాయి. ఢిల్లీ, యూపీ, ఇతర రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగిస్తూ..నిర్ణయం తీసుకున్నాయి. అయితే..తెలుగు రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్ దిశగా నిర్ణయం తీసుకోవడం లేదు.

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మాత్రం కొనసాగుతోంది. ఏపీలో మాత్రం మధ్యాహ్నం కర్ఫ్యూ విధించింది సీఎం జగన్ ప్రభుత్వం. మరి తెలంగాణలో లాక్ డౌన్ విధిస్తారా ? లేదా ? అనేది కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

మరోవైపు తెలంగాణలో కొత్తగా 4 వేల 826 కేసులు నమోదయ్యాయి. 32 మంది మృతి చెందారు. ప్రస్తుతం 62 వేల 797 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 2 వేల 771 మంది చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో 723 కరోనా కేసులు వెలుగు చూశాయి.

Read More : లడఖ్ లో 17వరకు కర్ఫ్యూ పొడిగింపు