Telangana Cabinet : నెరవేరనున్న ఉద్యోగుల కల..రేపే తెలంగాణ కేబినెట్ మీటింగ్

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల నెరవేరనుంది. ఫిట్‌మెంట్‌ ఫైల్‌ పై సీఎం కేసీఆర్‌ సంతకం చేసినట్లు తెలుస్తోంది. పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌కు తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 2021, జూన్ 08వ తేదీ మంగళవారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్ మీటింగ్ పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది.

Telangana Cabinet : నెరవేరనున్న ఉద్యోగుల కల..రేపే తెలంగాణ కేబినెట్ మీటింగ్

T.cabinet

Telangana PRC : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల నెరవేరనుంది. ఫిట్‌మెంట్‌ ఫైల్‌ పై సీఎం కేసీఆర్‌ సంతకం చేసినట్లు తెలుస్తోంది. పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌కు తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 2021, జూన్ 08వ తేదీ మంగళవారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్ మీటింగ్ పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. ప్రధానంగా ఉద్యోగుల పీఆర్సీపై అందరి దృష్టి నెలకొంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వేసిన పీఆర్‌సీ క‌మిటీ నివేదిక ప్రకారం 2015లో సీఎం కేసీఆర్ 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత ఉద్యోగులు పీఆర్సీ కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దీనితో బిస్వాల్ కమిటీని ఏర్పాటు చేసి.. ఉద్యోగుల జీత‌భత్యాల‌పై రిపోర్ట్ తీసుకుంది ప్రభుత్వం. బిస్వాల్ క‌మిటీ 7.5 శాతం ఫిట్‌మెంట్ రెక‌మండ్ చేయ‌డంతో.. ఉద్యోగులు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. దీంతో సీఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలో త్రీమెన్ క‌మిటీతో ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చలు జ‌రిపించి నివేదిక తీసుకున్న సీఎం కేసీఆర్.. 30 శాతం ఫిట్‌మెంట్ కు ఓకే చెప్పారు.

పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌కు సంబంధించి 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో వ‌రుసగా వ‌చ్చిన నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌, ఎమ్మెల్సీ, మున్సిపల్‌ ఎన్నిక‌ల‌తో ఎల‌క్షన్ కోడ్ కార‌ణంగా పీఆర్‌సీ అమ‌లు ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. దీంతో అప్పటి నుంచి పీఆర్‌సీ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కేబినెట్‌ సమావేశంలో మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.
మరోవైపు…

కరోనా కేసులు తగ్గడంతో అన్‌లాక్‌ దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. లాక్‌డౌన్‌, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వ్యవసాయ రంగం, కరోనా థర్డ్‌ వేవ్‌తో పాటు ఇతర అంశాలపై కూడా కేబినెట్‌ భేటీ కానుంది. ఇప్పటికే మధ్యాహ్నం ఒంటిగంట వరకు మినహాయింపు ఇచ్చిన సర్కార్‌… ఈ నెల 9 తర్వాత లాక్‌డౌన్‌ కొనసాగించాలా… లేక ఎత్తివేయాలా అనే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్‌లాక్‌ చేసి… నైట్‌ కర్ఫ్యూ మాత్రం కొనసాగించే అవకాశం ఉంది.

Read More : Kerala : కేరళలో జూన్ 16వరకు లాక్ డౌన్ పొడిగింపు