Telangana : త్వరలో తెలంగాణ కేబినెట్ మీటింగ్, 70 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు!

నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యలో దాదాపు 70 వేల జాబ్‌లకు సంబంధించి నోటిఫికేషన్ల జారీ చేసేందుకు కేబినెట్‌లో పచ్చజెండా ఊపనున్నారని తెలుస్తోంది.

Telangana : త్వరలో తెలంగాణ కేబినెట్ మీటింగ్, 70 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు!

Telangana Job

Telangana Cabinet : తెలంగాణ కేబినెట్‌ త్వరలో సమావేశం కానుంది. ఈ నెల 14న మంత్రివర్గ సమావేశమయ్యే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే భేటీలో పలు కీలక అంశాలు, తాజా రాజకీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ వైఖరి చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు, నెలలోపు పంటల సాగుపై అవగాహన కల్పించడంపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగాల భర్తీపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌ స్పష్టత ఇచ్చారు. నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యలో దాదాపు 70 వేల జాబ్‌లకు సంబంధించి నోటిఫికేషన్ల జారీ చేసేందుకు కేబినెట్‌లో పచ్చజెండా ఊపనున్నారని తెలుస్తోంది. ఎప్పటిలోగా ఉద్యోగాలను భర్తీ చేయాలనేది కేబినెట్‌ మీటింగ్‌లో చర్చిస్తారు.

Read More : SCCL : బొగ్గు గనిలో విషాదం…కార్మికుల ఆందోళన, ఒకరికి ఉద్యోగం ఇస్తాం

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపైనా కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. ప్రభుత్వం తరపు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన అంశాలు, భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. వరి కాకుండా లాభసాటి వ్యవసాయం కోసం ఏయే పంటలు వేస్తే బాగుంటుందో చర్చిస్తారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చేలా తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
త్వరలో జరగనున్న కేబినెట్‌ సమావేశంలో దళిత బంధుపై మరోసారి చర్చించే అవకాశం ఉంది.

Read More : Haryana CM : పద్మశ్రీ అవార్డుతో సీఎం ఇంటి ముందు నిరసన

ఇప్పటికే వాసాలమర్రి, హుజురాబాద్‌తో పాటు నాలుగు మండలాల్లోని దళిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో దళితబంధు అమలు చేయాలని నిర్ణయించారు. ఇది కాకుండా 119 నియోజకవర్గాల్లోనూ కనీసం వంద మంది లబ్ధిదారులకు దళిత బంధు సాయం అందించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో్ విద్యుత్ యూనిట్‌, ఆర్టీసీ టికెట్ ఛార్జీలు పెంపుపైనా నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలపై చర్చించి..రాష్ట్రానికి రావాల్సిన నిధులు, దక్కాల్సిన వాటాలపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసేలా తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది.