Telangana Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలతోపాటు కవితకు ఈడీ నోటీసులపై చర్చ

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ గురువారం (మార్చి9,2023) జరుగనుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Telangana Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలతోపాటు కవితకు ఈడీ నోటీసులపై చర్చ

TS CABINET

Telangana Cabinet Meeting : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ గురువారం (మార్చి9,2023) జరుగనుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులతోపాటు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. పరిపాలనా పరమైన అంశాలతో పాటు రాజకీయ అంశాలపైన కేబినెట్ లో చర్చించనున్నారు. ఇక ముఖ్యంగా కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై చర్చించే అవకాశం ఉంది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గవర్నర్ కోటా కింద మరో రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. గవర్నర్ కోటాలో నియమితులైన ఎమ్మెల్సీలు డి.రాజేశ్వర్ రావు, ఫరూక్ హుస్సేన్ పదవీ కాలం మే నెలలో పూర్తి కానుంది. వీరి స్థానాల్లో కొత్త అభ్యర్థులను నామినేట్ చేయాల్సివుంది. ఇప్పటికే పలువురు ఆశావహులు లైన్ లో ఉన్నారు.

Telangana Cabinet, BRS Meeting : తెలంగాణ కేబినెట్, బీఆర్ఎస్ సమావేశాలు.. కవితకు ఈడీ నోటీసులతో ప్రాధాన్యత

రాష్ట్రంలో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని ఆ శాఖ న్యూస్ స్పోర్ట్స్ పాలసీని కూడా రూపొందించింది. ఈ క్రీడా పాలసీపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాలను, అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ అంశాలపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

స్వంత ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి విధి విధాలను రూపొందించారు. దీనిపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ నెల నుంచి ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల సాయం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన అంశంపై కేబినెట్ లో చర్చించే చాన్స్ ఉంది.

Telangana Cabinet Key Decisions : కొత్తగా 10లక్షల పెన్షన్లు, 5వేల పోస్టులు భర్తీ.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఇప్పటికే మంత్రి కేటీఆర్ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ రెండు సార్లు సమావేశమై చర్చించింది. అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనిపై కూడా చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న భూములను కూడా రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంలో కూడా సమావేశంలో డిస్కస్ చేసే నిర్ణయం తీసుకోనున్నారు.