Telangana : టుడే తెలంగాణ కేబినెట్ భేటీ..2022-23 బడ్జెట్‌‌కు ఆమోదం

ఉద్యోగ నోటిఫికేషన్స్, పేదలకు ఇల్లు, మన ఊరు మన బడితో పాటు సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర పడనుంది. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పన పూర్తి అయ్యింది. గత బడ్జెట్ కంటే ఎక్కువగా కేటాయింపులు...

Telangana : టుడే తెలంగాణ కేబినెట్ భేటీ..2022-23 బడ్జెట్‌‌కు ఆమోదం

Cm Kcr (5)

Telangana Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన 2022, మార్చి 06వ తేదీ ఆదివారం జరిగే సమావేశంలో 2022-23 బడ్జెట్‌కి ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే ఉద్యోగ నోటిఫికేషన్స్, పేదలకు ఇల్లు, మన ఊరు మన బడితో పాటు సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర పడనుంది. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పన పూర్తి అయ్యింది. గత బడ్జెట్ కంటే ఎక్కువగా కేటాయింపులు ఉండనున్నాయి. కరోనా నుంచి కోలుకున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్న క్రమంలో బడ్జెట్ అంచనాలు భారీగా ఉండనున్నట్లు సమాచారం.

Read More : Telangana budget 2021-22 : తెలంగాణ బడ్జెట్ రూ.2,30,825 కోట్లు

వ్యవసాయం, సంక్షేమం, పెరిగిన జీత భత్యాలతో పాటు దళిత బంధు లాంటి పథకాలకు భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో దళిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే దళిత బంధు స్కీమ్‌కు 2022-23 బడ్జెట్లో ప్రాధాన్యతగా తీసుకుంది ప్రభుత్వం. ప్రతి ఏటా బడ్జెట్ లో 20 వేల కోట్ల రూపాయలను పెడుతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది ఆర్థిక బడ్జెట్ 2 లక్షల 50 వేల నుంచి 2 లక్షల 70 వేల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చానేది అధికారుల అంచనా.

Read More : Telangana Assembly : త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. దళిత బంధు పథకానికి చట్టబద్ధత

కేబినెట్ భేటీలో ఉద్యోగాల భర్తీ పై సర్కార్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దాదాపు 60 వేల వరకు ఖాళీలను భర్తీ కి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. డబుల్ బెడ్ రూమ్ పథకం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో.. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల 10 వేల రూపాయలు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే వ్యవసాయ, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేయాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 07వ తేదీ సోమవారం ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ఎన్నిరోజులు జరగాలనేది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. కరోనా సంక్షోభం నుంచి కోలుకున్న తర్వాత జరిగే ఈ బడ్జెట్ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకుంది. బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయిస్తారనేది ఆసక్తి నెలకొంది.