Ts cabinet meeting : రేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ

మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ మంత్రి వర్గం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు...

Ts cabinet meeting : రేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ

Cm Kcr

Ts cabinet meeting : మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ మంత్రి వర్గం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ల విషయంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. వారం రోజలుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించిన తెరాస శ్రేణులు.. సోమవారం ఢిల్లీ కేంద్రంగా రైతు నిరసన దీక్ష చేపట్టారు.

KCR In Delhi : ధాన్యం దంగల్.. ఢిల్లీ వేదికగా గర్జించిన కేసీఆర్, 24 గంటల డెడ్ లైన్

ఈ రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొంటుందో కొనదో 24 గంటల్లో తేల్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి డెడ్ లైన్ విధించారు. ఈ క్రమంలో కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. కేంద్రం స్పందనను బట్టి ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపై కేబినెట్ లో కేసీఆర్ మంత్రులతో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి పనులు, పథకాల అమలుపై సీఎం కేసీఆర్ కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశముంది.