Mmaoist Rajitha : మావోయిస్టు నేత ఆజాద్‌పై లైంగిక వేధింపుల కేసు .. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా మావోయిస్టు

మావోయిస్టు కీలక నేత ఆజాద్‌ మహిళా దళ సభ్యులను లైంగిక వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళా మావోయిస్టు.

Mmaoist Rajitha : మావోయిస్టు నేత ఆజాద్‌పై లైంగిక వేధింపుల కేసు .. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా మావోయిస్టు

case of sexual harassment has been registered against a maoist leader azad

Mmaoist Rajitha : మావోయిస్టు కీలక నేత ఆజాద్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. మావో నేత ఆజాద్ అలియాస్ సాంబయ్య మహిళలను లైంగికంగా వేధిస్తున్నారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ ఫిర్యాదు ఇచ్చిన మహిళ మావోయిస్టు కీలక నేత దామోదర్ భార్య రజిత కావటం ఆసక్తిగా మారింది. కొన్ని రోజుల క్రితం పోలీసులు ఛత్తీస్ గడ్ అడవుల్లో కొంతమంది మహిళా మావోయిస్టులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిలో మావోయిస్టు కీలక నేత దామోదర్ భార్య రజిత కూడా ఉంది.

దళంలో మహిళలను ఆజాద్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని రజిత ఇచ్చిన ఫిర్యాదుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ మొదటివారంలో ఛత్తీస్ గడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారనే పక్కా సమాచారంతోపోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మహిళా మావోయిస్టులు పోలీసులకు పట్టుబడ్డారు.వారిలో మావో కీలక నేత దామోదర్ భార్య రజిత అలియాస్ మడకం కోసి కూడా ఉంది. రజితతో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. రజితపై 80కిపైగా కేసులున్నాయి. దళంలో రజిత కీలక వ్యక్తిగా ఉందని ఆమెను అరెస్ట్ చేశామని..ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించామని భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్ తెలిపారు.

ఈక్రమంలో రజిత మావో నేత ఆజాద్ మహిళా దళ సభ్యులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయటం ఆసక్తిగా మారింది. గండ్రాజిగూడెం వద్ద మావోయిస్టు సభ్యులు సమావేశం అయిన సందర్భంలో మహిళా దళ సభ్యులతో ఆజాద్ అసభ్యకరంగా ప్రవర్తించాడని రజిత ఫిర్యాదులో పేర్కొంది. అలా ఆజాద్ వేధింపులు భరించలేక ఓ మహిళా సభ్యురాలు తన ఇంటికి వెళ్లిపోయిందని తెలిపింది. అంతేకాదు ఆజాద్ పార్టీ ఫండ్ పేరుతో అక్రమంగా డబ్బు వసూలు చేస్తుంటాడని ఈ విషయంలో ఆజాద్ ను పార్టీ తీవ్రంగా మందలించిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కానీ రజిత ఇప్పటి వరకు కామ్ గా ఉండి పోలీసులకు పట్టుబడిన తరువాత ఆజాద్ పై పలు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆజాద్ నిజంగా మహిళా సభ్యులను వేధిస్తున్నాడా? లేదా రజిత ఆజాద్ పై చేసేవి కేవలం ఆరోపణలా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.