Huzurabad : హుజూరాబాద్ ఉప ఎన్నికలు..రోడ్ షోలు, బైక్-సైకిల్ ర్యాలీలకు అనుమతి లేదు

ఎన్నికల ప్రక్రియలో కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పేర్కొన్నారు. ఈసీ, కోవిడ్ నిబంధనలకు లోబడే ప్రచారం జరగాలన్నారు.

Huzurabad : హుజూరాబాద్ ఉప ఎన్నికలు..రోడ్ షోలు, బైక్-సైకిల్ ర్యాలీలకు అనుమతి లేదు

Shashank

Huzurabad by-elections : తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 30న హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించింది. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ విడుదల చేసింది.

Huzurabad By Poll Schedule : హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఎన్నికల ప్రక్రియలో కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పేర్కొన్నారు. ఈసీ, కోవిడ్ నిబంధనలకు లోబడే ప్రచారం జరగాలన్నారు. నామినేషన్ ముందు, తర్వాత ర్యాలీలు చేయొద్దని పేర్కొన్నారు. రోడ్ షోలు, బైక్, సైకిల్ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలింగ్ కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల ఉందని తెలిపారు. ఈవీఎంల తొలి దశ తనిఖీ పూర్తైందన్నారు. 305 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. హుజూరాబాద్ లో అందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అమల్లో ఉన్న పథకాలు, కార్యక్రమాలకు ఇబ్బంది ఉండదని తెలిపారు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే ఈసీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. బోగస్ ఓట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Mushrooms : పుట్టగొడుగులతో క్యాన్సర్, పక్షవాతానికి చెక్

కాగా తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంతో జూన్‌ 12న తన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున విద్యార్థి నాయ‌కుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పోటీ చేస్తున్నారు. రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీ తరుఫున పోటీ చేస్తున్నారు.