CM KCR Tour : తమిళనాడుకు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసమేతంగా...తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు...

CM KCR Tour : తమిళనాడుకు సీఎం కేసీఆర్

Kcr And Stalin

KCR Tamilnadu Tour : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసమేతంగా…తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. 2021, డిసెంబర్ 13వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. ముందుగా..శ్రీరంగంలోని రంగనాథ ఆలయానికి వెళ్లి..స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో చెన్నైకి చేరుకుని అక్కడే బస చేస్తారని, డిసెంబర్ 14వ తేదీ మంగళవారం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తో భేటీ కానున్నారని తెలుస్తోంది.

Read More : Himachal Pradesh : మేరా ఫౌజీ అమర్ రహే, పెళ్లి చీర ధరించి…భర్తకు కన్నీటి వీడ్కోలు

యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవానికి సీఎం స్టాలిన్ ను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే యాదాద్రి పునర్ నిర్మాణపనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. అయితే…ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తమిళనాడు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 2010, మే 13వ తేదీన సీఎం కేసీఆర్ శ్రీరంగం వెళ్లి…డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం కేసీఆర్ ఎండగడుతున్నారు.

Read More : Omicron Cases In India : భారత్‌లో ఒమిక్రాన్ కలవరం.. కేరళలో తొలి కేసు నమోదు.. 38కి పెరిగిన బాధితులు

యాసంగిలో దొడ్డు బియ్యం సేకరించడం లేదని, వానాకాలంలోనూ…ధాన్యం సేకరణ లక్ష్యాన్ని స్పష్టం వెల్లడించకపోవడంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ప్రస్తావిస్తూ..ఆందోళనలకు దిగారు. తర్వాత..సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బియ్యం సేకరణ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ…పంటలకు మద్దతు ధరలపై విధాన నిర్ణయాన్ని కేంద్రం వెల్లడించాలంటూ…ఇతర రాజకీయ పార్టీల మద్దతు సమీకరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే…ఆయన స్టాలిన్ తో చెన్నైలో భేటీ కానున్నారని సమాచారం.