CM KCR Early Election Paln : సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్లాన్..?

తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల్లో ముందస్తుకు వెళ్లనుందా? అభివృద్ధి పనుల్లో వేగం.. పెండింగ్ పనుల్లో స్పీడ్‌ ముందస్తు కోసమేనా..? సీఎం కేసీఆర్ ముందస్తుకు సై అంటున్నారా. విపక్షాలు కూడా ప్రీపోల్‌నే కోరుకుంటున్నాయా? అందుకేనా సీఎం కేసీఆర్ అన్ని విషయాల్లోను దూకుడు పెంచారు? ఇలా పలు అంశాలు పరిశీలిస్తే ముందస్తు ఎన్నికల ప్లాన్ లో గులాబీ బాస్ బిజీ బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

CM KCR Early Election Paln :  సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్లాన్..?

CM KCR Early Election paln : తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల్లో ముందస్తుకు వెళ్లనుందా? అభివృద్ధి పనుల్లో వేగం.. పెండింగ్ పనుల్లో స్పీడ్‌ ముందస్తు కోసమేనా..? సీఎం కేసీఆర్ ముందస్తుకు సై అంటున్నారా. విపక్షాలు కూడా ప్రీపోల్‌నే కోరుకుంటున్నాయా? అందుకేనా సీఎం కేసీఆర్ అన్ని విషయాల్లోను దూకుడు పెంచారు? ఇలా పలు అంశాలు పరిశీలిస్తే ముందస్తు ఎన్నికల ప్లాన్ లో గులాబీ బాస్ బిజీ బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. ఒకవైపు అభివృద్ధిపనుల్లో వేగం పెంచారు. మరోవైపు రెండు నెలల్లో రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలను క్లియర్ చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు టార్గెట్‌ పెట్టారు. ఇంకోవైపు అధికారులను బదిలీ చేస్తున్నారు. ఇవన్నీ ముందస్తు ఎన్నికల కోసమేనని విపక్షాలు చెప్తున్నాయి. మూడు నెలల్లో కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి… ముందస్తుకు వెళ్తారని అంటున్నాయి.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు కొంత మేర వ్యతిరేకతను చవిచూడక తప్పదన్న సమాచారంతో సీఎం కేసీఆర్ అప్రమత్తయ్యారన్న చర్చ జరుగుతోంది. అందుకే ముఖ్యమంత్రి ఎక్కడిక్కడ అధికారులను ప్రక్షాళన చేస్తూ .. అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారని సమాచారం. పెండింగ్ పనులను రెండు నెలల్లో పూర్తిచేసి వచ్చే ఫిబ్రవరి లేదా మార్చాలో ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2018లోనూ ఇలాగే ముందస్తుకు వెళ్లి విజయం సాధించిన కేసీఆర్.. ఈసారి కూడా ఇదే ఫార్ములా వాడి హాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

జిల్లా పర్యటనలు, బహిరంగ సభలు, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలతో బిజీగా ఉన్న సీఎం కేసీఆర్.. ఈనెలలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కేంద్రాన్ని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఉద్యోగాల జాతరకు తెరలేపిన CM KCR తాజాగా మరో పదహారు వేల జాబ్స్‌కు విడతల వారీగా నోటిఫికేషన్‌లు ఇస్తున్నారు. ఇక కొత్త స్కీములను ప్రవేశపెట్టేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తiన్నారు.

ముందస్తు ప్రచారానికి ఊతమిచ్చేలా నియోజకర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు అప్పుడే కులాలవారీగా హమీల వర్షం కురిపిస్తోన్నట్టు సమాచారం.

ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ వచ్చే ఆరు నెలల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్‌ చెప్తున్నారు. దీన్ని బట్టి కేసీఆర్ ముందస్తుకు వెళ్తారన్న సమాచారం కేంద్రానికి ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే తక్కువ సమయంలో తెలంగాణ అంతటా పాదయాత్ర చేయడం కుదరని బండి సంజయ్‌ బస్సుయాత్రకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి తెలంగాణలో ముందస్తు వేడి రాజుకుంటుంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ముందస్తుపై మరింత స్పష్టత వచ్చే అవకాశముందంటున్నారు విశ్లేషకులు.