Cm KCR : మూడు ప్రధాన డిమాండ్లతో ఢిల్లీకి పయనమైన కేసీఆర్

సీఎం కేసీఆర్ ఆదివారం ఢిల్లీలో వెళ్లనున్నారు. ప్రధానంగా మూడు డిమాండ్లతో కేసీఆర్ బృందం హస్తిన వెళ్తోంది.

Cm KCR : మూడు ప్రధాన డిమాండ్లతో ఢిల్లీకి పయనమైన కేసీఆర్

Cm Kcr (4)

Cm KCR :  సీఎం కేసీఆర్ బృందం ఆదివారం ఢిల్లీ వెళ్తోంది. ప్రధానంగా మూడు డిమాండ్లతో కేసీఆర్ బృందం హస్తిన వెళ్తోంది. కేంద్రం తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి చ‌నిపోయిన‌ ప్ర‌తి రైతు కుటుంబానికి 25 ల‌క్షల పరిహారం, రైతుల‌పై న‌మోదైన కేసుల‌ ఎత్తివేత, క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం తీసుకురావాలని డిమాండ్ చేయనున్నారు.

చదవండి : CM KCR Demands : సహనాన్ని పరీక్షించొద్దు..నీటి వాటాలు తేల్చేయాలి, లేకపోతే ఇక పోరాటాలే

అలాగే ధాన్యం గోనుగోళ్లు, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీపై కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. కేసీఆర్ తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వెళ్లనున్నారు. దాన్యం కొనుగోళ్లపై ఇవాళ కేంద్ర పెద్దలతో మంత్రులు, అధికార బృందం చర్చలు జరపనున్నారు. ప్రధాని అపాయింట్ మెంట్ దొరికితే పలు అంశాలను ప్రస్తావించే యోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్.

చదవండి : CM Kcr Warning : వడ్లను తీసుకోవాల్సిందే..లేకపోతే బీజేపీ ఆఫీసుపై కుమ్మరిస్తాం – సీఎం కేసీఆర్ హెచ్చరిక

కులగణన, ఎస్సీ వర్గీకరణ, గోదావరి, కృష్ణా నదుల నీటి పంపకాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు, విద్యుత్ చట్టం రద్దు తదితర అంశాలపై కూడా ఢిల్లీతో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ఇక రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి 700 మంది మరణించిన విషయం తెలిసిందే.. మృతుల కుటుంబాలకు 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

చదవండి : CM KCR : తెలంగాణ పండించే వడ్లను కొంటరా ? కొనరా ? సీఎం కేసీఆర్ సూటి ప్రశ్న

కులగణన, ఎస్సీ వర్గీకరణపై కూడా కేసీఆర్ కేంద్రంతో మాట్లాడే అవకాశం ఉంది. కేసీఆర్ సమావేశం అనంతరం యాసంగి వరిపంట వేయాలా లేదా అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.