CM KCR : ఓవైపు సుడిగాలి పర్యటనలు, మరోవైపు సహపంక్తి భోజనాలు.. రూటు మార్చిన సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ రూటు మార్చారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిజీగా గడిపేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రగతిభవన్, ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారంటూ విమర్శించిన విపక్షాలకు కేసీఆర్ దూకుడు చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవుతోంది.

CM KCR : ఓవైపు సుడిగాలి పర్యటనలు, మరోవైపు సహపంక్తి భోజనాలు.. రూటు మార్చిన సీఎం కేసీఆర్

Cm Kcr

CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ రూటు మార్చారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిజీగా గడిపేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రగతిభవన్, ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారంటూ విమర్శించిన విపక్షాలకు కేసీఆర్ దూకుడు చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవుతోంది. మొన్నటికి మొన్న మూడు జిల్లాలను చుట్టేసిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత వాసాలమర్రిలో పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

అక్కడే గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆలోపే దళిత్ ఎంపవర్ మెంట్ పై మీటింగ్ కు రెడీ అయిపోయారు సీఎం కేసీఆర్. తెలంగాణలో దళితుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న స్కీమ్ ”సీఎం దళిత్ ఎంపవర్ మెంట్”.

మొన్న వాసాలమర్రిలో కూడా దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పిన సీఎం కేసీఆర్.. సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ స్కీమ్ ప్రతిపాదన పెట్టారు. ఈ పథకం ఎలా ఉండాలి? ఎలా అమలు చేయాలి? రాష్ట్రంలో దళితుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. ఈ స్కీమ్ పై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విపక్షాలను విస్మయానికి గురి చేశారు. రేపు(జూన్ 27,2021) ఉదయం 11.30 గంటల నుంచి సుదీర్ఘంగా జరిగే సమావేశంలో విధివిధానాలను ఖరారు చేయాలని భావిస్తున్నారు. సమావేశానికి సీనియర్ దళిత నేతలను పంపించాలంటూ సీపీఐ, సీపీఎం పార్టీల రాష్ట్ర కార్యదర్శులకు సీఎం కేసీఆరే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు.

అలాగే ప్రధాన పార్టీల నేతలనూ ఆహ్వానించారు. సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ స్కీమ్ పై రేపు జరిగే అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రంలో దళితుల సంక్షేమం, అభివృద్ధిపై రాజకీయాలకు అతీతంగా చర్చిస్తారు. రాజకీయ నేతలతో పాటు దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న, దళితుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న పలువురు నేతలను సమావేశానికి ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో వ్యవహరిస్తోంది. అన్ని రంగాల్లో దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతోంది.